తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈనెల 4వ తేదీన తెలంగాణలోని ములుగుతో పాటుహైదరాబాద్‌, తదితర జిల్లాల్లోని భూకంపం సంభవించింది. ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 5.3గా నమోదైందని గుర్తించారు అధికారులు. ఇదిలా ఉంటే తాజాగా శనివారం తెలంగాణలోని మహబూబ్‌నగర్‌లో మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై తీవ్రత 3.0గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. 4న వచ్చిన ములుగు జిల్లాలోని మేడారానికి ఉత్తర దిశలో భూకంప కేంద్రం నమోదైనట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. భూమి లోపల 40 కి.మీ.

దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు చెప్పారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేలుపై 5.3 నమోదైంది.
వరంగల్, హనుమకొండ, ఖమ్మం, భద్రాద్రి, హైదరాబాద్‌ సహా పలుచోట్ల భూమి కంపించింది. తెలంగాణలో 20ఏళ్లలో తొలిసారి భారీగా ప్రకంపనలు వచ్చాయన్నారు శాస్త్రవేత్తలు. భూమి పొరల మధ్య తేడాలుంటే భూకంపాలు వస్తాయన్నారు. గోదావరి బెల్ట్‌లో భూమి పొరల్లో చాలా తేడాలున్నాయని, అందుకే గోదావరి పరివాహకంలో పలుసార్లు ప్రకంపనలు సంభవించాయంటున్నారు ఎన్‌జీఆర్‌ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీనగేష్ తెలిపారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here