సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున ను అరెస్టు చేయడంపై పలువురు సినీ నటులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. తాజాగా ఇదే విషయమై న్యాచురల్ స్టార్ నాని సంచలన ట్వీట్ చేశారు.
అల్లు అర్జున్ అరెస్టుపై న్యాచురల్ స్టార్ నాని ఘాటుగా స్పందించారు. ఇలాంటి కేసుల్లో ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా? అంటూ ట్విట్టర్ వేదికగా మండి పడ్డాడు. గవర్నమెంట్ అథారిటీస్, పోలీసులు.. మీడియా షో, సినిమా వాళ్లపై చూపించే బాధ్యత కామన్ సిటిజన్స్ పై కూడా చూపిస్తే బాగుంటుంది. మనం మంచి సమాజంలో బతుకుతున్నాం. ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. ఇది ఒక ఉదాహరణగా తీసుకొని ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి.. ఇంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.. మరోసారి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలి . ఇక్కడ తప్పు మన అందరిదీ ఉంది. ఒక్కరి మీద నెట్టడం సమంజసం కాదు’ అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు నాని