2024వ సంవత్సరం చివరి సంకష్ట చతుర్థి రోజున గణపతి అనుగ్రహం పొందడానికి ఆచారాల ప్రకారం వినాయకుడిని పూజించండి. శుభముహూర్తంలో పూజించడం వల్ల జీవితంలో సుఖ సంతోషాలు, సౌభాగ్యాలు లభిస్తాయని వినాయకుడి అనుగ్రహం వల్ల ప్రజల కష్టాలన్నీ దూరమవుతాయని నమ్మకం.

సంకటహర చతుర్థి అనేది హిందూ మతంలో గణేశుడికి అంకితం చేయబడిన ఒక ముఖ్యమైన పండుగ. ప్రతి నెల కృష్ణ పక్ష చతుర్థి తిధిని సంకటహర చతుర్థిగా జరుపుకుంటారు. ‘సంకటహర’ అంటే ‘సంక్షోభం’ అని, ‘చతుర్థి’ అంటే ‘నాల్గవ రోజు’ అని అర్థం. ఈ రోజున వినాయకుడిని పూజించడం వలన అన్ని రకాల కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. జీవితంలో సుఖ సంతోషాలు నెలకొంటాయి.

మార్గశిర మాసంలోని కృష్ణ పక్ష చతుర్థి తిథిని అఖూర్త సంకష్ట చతుర్థి అంటారు. దీనిని చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ రోజున గణేశుడిని పూజించడం , ఉపవాసం ఉండటం వల్ల ప్రజలు వ్యాపారంలో విజయం సాధిస్తారని నమ్ముతారు. అంతేకాకుండా ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటుంది. పనిలో వచ్చే అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అఖూర్త సంకటహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలి తెలుసుకుందాం..

పంచాంగం ప్రకారం మార్గశిర మాసం కృష్ణ పక్ష చతుర్థి తిథి డిసెంబర్ 18వ తేదీ ఉదయం 10.06 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే డిసెంబర్ 19వ తేదీ ఉదయం 10.02 గంటలకు ముగుస్తుంది. అటువంటి పరిస్థితిలో ఈ ఏడాది అఖూర్త సంకటహర చతుర్థి ని డిసెంబర్ 18 న జరుపుకుంటారు., ఎందుకంటే సంకటహర చతుర్థి రోజున సాయంత్రం గణపతిని పూజిస్తారు. దీని తర్వాత ఉపవాసం విరమిస్తారు.

* బ్రహ్మ ముహూర్తం – ఉదయం 05:19 నుంచి 06:04 వరకు ఉంటుంది.

* విజయ ముహూర్తం – మధ్యాహ్నం 02:01 నుంచి 02:42 వరకు ఉంటుంది.

* సంధ్య ముహూర్తం – సాయంత్రం 05:25 నుంచి 05:52 వరకు ఉంటుంది.

* అమృత కాలం – ఉదయం 06:30 నుంచి 08:07 వరకు ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here