వాస్తవానికి నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి.. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా.. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.నయ్యి శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది.. ఇదొక్కటే కాదు, ఆరోగ్య పరంగా అనేక ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా బరువు పెరగడం లేదా ఊబకాయం అనేది చాలా మందికి ఆందోళన కలిగిస్తుంది.

చాలా సందర్భాలలో, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది.. స్థూలకాయం వల్ల ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఆస్టిటిస్, నిద్ర సమస్యలు పెరుగుతాయి. శారీరక సమస్యలే కాకుండా మానసిక అలసట, న్యూనతా భావంతో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో జీవితం మొత్తం ఆందోళనతో నిండిపోతుంది.. ఆయాసం తోపాటు చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే.. ఇలాంటి ఎన్నో సమస్యలను నెయ్యి దూరం చేస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు..

వాస్తవానికి నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి.. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా.. యాంటీఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తుంది.

అయితే.. శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడానికి ప్రయత్నించే వారికి ఆహారంలో నెయ్యి చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది.

నెయ్యిలో బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి సహాయపడే మంచి కొవ్వులు ఉన్నాయని పేర్కొన్నారు..

సహజంగానే ఐ ప్రశ్న తలెత్తవచ్చు.. నెయ్యిలో కొవ్వు మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అయితే, శరీరంలో కొవ్వును తగ్గించడం సాధ్యమేనా? పోషకాహార నిపుణురాలు నమామి ప్రకారం.. నెయ్యి కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.. నెయ్యి పోషకాహార పవర్ హౌస్ గా పేర్కొనడంతోపాటు.. దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా చెప్పారు..

నమామి ప్రకారం.. నెయ్యి తీసుకోవడం వల్ల శరీర జీవక్రియ మెరుగుపడుతుంది. ఇది కొవ్వును శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియను మెరుగుపరచడంలో నెయ్యి కూడా సహాయపడుతుంది. బరువు సమతుల్యతకు ఇది చాలా ముఖ్యమైన భాగం. నెయ్యి తీసుకుంటే.. ఎక్కువ సేపు ఆకలి వేయదు. మీరు దీనితో సంతృప్తి చెందవచ్చు.

నెయ్యితో కాఫీ కలుపుకోవచ్చు.. ఇది రోగనిరోధక శక్తిని, జీర్ణశక్తిని పెంచడంతోపాటు.. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. శరీరంలో శక్తిని, బరువును నిర్వహించడానికి నెయ్యి చాలా మంచిదని పోషకాహార నిపుణురాలు చెప్పారు..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here