కొంత మంది ఎన్ని ప్రయత్నాలు చేసినా నోటి దుర్వాసనను అదుపు చేయలేక ఇబ్బంది పడిపోతుంటారు. ఇందుకు ప్రధాన కారణం ఆహర అలవాట్లే. పోషకాహారం తీసుకోవడంతోపాటు ఈ కింది సింపుల్ చిట్కాలు ట్రై చేస్తే ఈ సమస్య క్షణాల్లో వదిలిపోతుంది..
నోటి దుర్వాసనతో బాధపడేవారు నలుగురిలోకి వెళ్లేందుకు ఇబ్బంది పడిపోతుంటారు. ఎవరితోనైనా మాట్లాడటం కూడా కష్టంగా ఉంటుంది. దీంతో వారిలో ఆత్మవిశ్వాసం కూడా తగ్గుతుంది. దీనికి ప్రధాన కారణం రాంగ్ డైట్ అని నిపుణులు చెబుతున్నారు.
అలాగే రోజుకు రెండుసార్లు పళ్లు తోముకోకపోవడం, నాలుకను శుభ్రం చేసుకోకపోవడం, పళ్లు తోముకోకుండా రాత్రి నిద్రపోవడం వంటి చెడు అలవాట్ల వల్ల కూడా నోటి దుర్వాసన వస్తుంది. అయితే శ్వాసను తాజాగా ఉంచేందుకు మార్కెట్లో అనేక రకాల మౌత్ ఫ్రెషనర్లు అందుబాటులో ఉన్నాయి. కానీ ఇంట్లోనే ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఎలాగంటే..
పుదీనా నోటి దుర్వాసనకు మంచి రెమెడీ. సోంపు, యాలకులు, పుదీనా కూడా సహజమైన మౌత్ ఫ్రెషనర్లుగా పని చేస్తాయి. అందుకే భోజనం తర్వాత పుదీనా ఆకులను నమలాలని నిపుణులు చెబుతున్నారు. ఇది నోటి దుర్వాసనను తొలగిస్తుంది.
నోటి దుర్వాసన పోగొట్టడంలో లవంగాలు కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. లవంగాలు తినడం వల్ల నోటి దుర్వాసన తొలగిపోతుంది. లవంగాలు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి నోటిలోని చెడు బ్యాక్టీరియాను నిర్మూలిస్తాయి.
కొత్తిమీర ఒక అద్భుతమైన క్రిమినాశక. ఇందులో సల్ఫర్ ఎక్కువగా ఉండటం వల్ల నోటి దుర్వాసనను సులభంగా తొలగిస్తుంది. భోజనం తిన్న తర్వాత రెండు కొత్తిమీర ఆకులను బాగా నమలడం వల్ల నోటి దుర్వాసనపోతుంది.