పెళ్లైతే గ్లామర్ షో చేయకూడదా..? అలాగని రాజ్యాంగంలో ఏమైనా రాసారా అంటూ ప్రశ్నిస్తున్నారు మన హీరోయిన్లు. ఒకప్పుడు పెళ్లంటే కెరీర్‌కు శుభం కార్డ్ అనుకునేవాళ్లు కానీ ఇప్పుడలా కాదు. పెళ్లైన హీరోయిన్లకే క్రేజ్ కూడా ఎక్కువగా ఉందిప్పుడు. ఆఫ్టర్ మ్యారేజ్ గ్లామర్ షోలో ఇంకాస్త దూకుడు పెంచేస్తున్నారు ముద్దుగుమ్మలు. మరి వాళ్లెవరో చూద్దామా..?

చూస్తున్నారుగా కీర్తి సురేష్ పెళ్లి ఫోటోలను..! 15 ఏళ్ళుగా తాను ప్రేమిస్తున్న ఆంటోనీ తటిల్‌తో గోవాలో మూడు ముళ్లు వేయించుకున్నారు కీర్తి. అయితే పెళ్లికి రెండు మూడు రోజుల ముందే ఈమె చేసిన ఫోటోషూట్ ఎలా ఉందో తెలుసా..? చూసేయండి అది కూడా..

పెళ్లి దగ్గర పడుతున్న సమయంలో గ్లామర్ డోస్ మరింత పెంచేసారు కీర్తి. బేబీ జాన్‌లో అయితే మునుపెన్నడూ లేని గ్లామరస్ కీర్తి దర్శనమిచ్చింది. అలాగే రకుల్ కూడా అంతే. గతేడాది ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లాడాక.. గ్లామర్ డోస్ ఇంకాస్త పెంచేసారు. ఎప్పటికప్పుడు కొత్త ఫోటోషూట్స్ చేస్తున్నారు.

కియారా అద్వానీ సైతం శ్రీమతి అయ్యాకే మరింత రెచ్చిపోతున్నారు.సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు కియారా. పెళ్లైన తర్వాత కూడా లిప్ లాక్ సీన్స్‌తో పాటు గ్లామర్ షోలో హద్దులే పెట్టుకోలేదు ఈ బ్యూటీ.

రకుల్ అలాగే మిసెస్ రణ్‌బీర్ కపూర్ అలియా భట్ సైతం గ్లామర్ షోలో తగ్గేదే లే అంటున్నారు. కత్రినా కైఫ్, దీపిక పదుకొనే గురించి చెప్పాల్సిన పనేలేదు. మొత్తానికి పెళ్లితో ఇంటిపేరు మారుతుందేమో గానీ.. గ్లామర్ షో మాత్రం ఆగట్లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here