అసలే చలికాలం.. సీజనల్‌ వ్యాధులు విచ్చలవిడిగా వేధిస్తుంటాయి. అయితే, ఈ చలికాలంలో జలబు, దగ్గు, వంటి సమస్యలకు అనేకమైన ఇంటి చిట్కాలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఖర్జూరం,పాలు.. ఖర్జూరం కలిపిన పాలు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. పాలల్లో ఖర్జూరం కలిపి తీసుకుంటే చలిలో ఉపశమనం ఇస్తుంది. మరిన్ని లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

పాలు-ఖర్జూరంలో పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. పాలు కాల్షియం, ప్రోటీన్, విటమిన్ B12, ఇతర ముఖ్యమైన ఖనిజాల నిధిగా పిలుస్తారు. ఈ రెండింటీ కలయిక ఎముకలను బలోపేతం చేస్త్ఉంది. కండరాల పెరుగుదల, రోగనిరోధక శక్తిని పెంచడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఖర్జూరంలో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించే యాంటీఆక్సిడెంట్లు వీటిలో సమృద్ధిగా ఉంటాయి. పాలలో ఉండే కాల్షియం, ఖర్జూరంలో ఉండే మినరల్స్ కలిసి ఎముకలను బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లలు, టీనేజర్లు, వృద్ధులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

ఖర్జూరంలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను, మలబద్ధకం, అజీర్ణం, ఇతర జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఖర్జూరంలో ఉండే సహజ చక్కెర శరీరానికి తక్షణ శక్తిని ఇస్తుంది. ఖర్జూరంలో ఉండే పొటాషియం రక్తపోటును, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పాలు, ఖర్జూరం రెండింటిలో యాంటీఆక్సిడెంట్లు రోగనిరోధకశక్తిని బలోపేతం చేసి సంక్రమణ నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. పాలు, ఖర్జూరం రెండింటిలో కేలరీలు, పోషకాలు బరువు పెరగడానికి సహాయపడుతుంది. ఖర్జూరంలో విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తుంది. చెప్పాలంటే చర్మానికి కూడా కొత్త కాంతినిస్తుంది.

పాలతో ఎండు ఖర్జూరాలను తీసుకుంటుంటే రోగనిరోధక శక్తిని పెరిగి పవర్ బూస్టరులా పనిచేస్తుంది. రక్తం లోపాన్ని తొలగిస్తుంది. రక్తపోటును నియంత్రించే శక్తి ఖర్జూరాలనుకున్నాయి. దంతాలు, ఎముకలకు మేలు చేస్తాయి. కంటిచూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here