చలికాలంలో పాదాలకు రక్షణ ఇస్తాయని చాలా మంది సిలికాన్ సాక్స్‌లను ధరిస్తారు. సాక్స్లు ధరించడం వలన పాదాల పగుళ్లను నయం చేయడమే కాదు చలి నుంచి రక్షణ లభిస్తుందని నమ్మకం. అయితే సిలికాన్ సాక్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలతో పాటు అనేక నష్టాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.
శీతాకాలంలో విపరీతమైన చలి, పొడి వాతావరణం కారణంగా పగిలిన మడమలు, పాదాల పొడి చర్మం వంటివి సాధారణ సమస్య. ముఖ్యంగా చలి కారణంగా పాదాలు పొడిగా మారి, పగుళ్లు ఏర్పడతాయి. అప్పుడు వీటిని నయం చేసుకునేందుకు మాయిశ్చరైజర్లు, క్రీములతో పాటు వంటింటి చిట్కాలను పాటిస్తారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో సిలికాన్ సాక్స్ ట్రెండ్‌లో ఉన్నాయి.
పాదాల సమస్య నుంచి ఉపశమనం కోసం సిలికాన్ సాక్స్ గొప్ప పరిష్కారంగా పరిగణించబడుతుంది. ఈ సాక్స్ పాదాలకు తేమను, పోషణను అందించడమే కాదు పాదాలను చలి నుంచి రక్షించి వాటిని మృదువుగా, ఆరోగ్యంగా ఉంచుతాయి. సాక్స్ ను ఉపయోగించడం వలన కొన్ని ప్రయోజనాలు.. కొన్ని నష్టాలు ఉన్నాయి. వీటిని తెలుసుకోవడం ముఖ్యం. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..
సిలికాన్ సాక్స్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు
* పాదాల తేమను కాపాడుతుంది: సిలికాన్ సాక్స్ చర్మంలో తేమను లాక్ చేయడంలో సహాయపడుతుంది. తద్వారా పగిలిన మడమలు, పొడి చర్మం సమస్యను నివారిస్తుంది.
* పగిలిన మడమలకు చికిత్స: ఈ సాక్స్‌లు తరచుగా జెల్ పొరను కలిగి ఉంటాయి. ఇది పగిలిన మడమలను సరిచేయడంలో సహాయపడుతుంది. చర్మానికి పోషణను అందిస్తుంది.
* చలికాలంలో వెచ్చదనం: ఈ సాక్స్ పాదాలను వెచ్చగా ఉంచుతాయి. చల్లని వాతావరణంలో చల్లని గాలుల నుంచి చర్మాన్ని కాపాడతాయి.
* సౌకర్యవంతమైన, మృదువైన సాక్స్ : సిలికాన్ సాక్స్ ధరించడం పాదాలకు సౌకర్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి తేలికగా, మృదువుగా ఉంటాయి.
* స్మూత్ స్కిన్: వీటిని రోజూ వాడడం వలన పాదాల చర్మం మృదువుగా మారుతుంది.
* ఔషధం లేదా మాయిశ్చరైజర్: శీతాకాలంలో పాదాల పగుళ్ళ నుంచి ఉపశమనం కోసం క్రీమ్ లేదా మాయిశ్చరైజర్‌ను ఉపయోగిస్తే.. సిలికాన్ సాక్స్ వేసుకోవడం వలన ప్రభావంతంగా పని చేస్తాయి.
సిలికాన్ సాక్స్ ధరించడం వల్ల కలిగే నష్టాలు
*చెమట సమస్య: సిలికాన్ సాక్స్‌లను ఎక్కువసేపు వేసుకుంటే చెమట పట్టకుండా చూసుకోవచ్చు. చెమట పట్టడం వలన బ్యాక్టీరియా పెరుగుతుంది. దుర్వాసన సమస్య ఏర్పడుతుంది.
* అలెర్జీ ప్రమాదం: సున్నితమైన చర్మం కలిగిన వ్యక్తులకు సిలికాన్ అంటే అలెర్జీ. అప్పుడు దద్దుర్లు లేదా దురద వంటి సమస్య ఏర్పడవచ్చు. అటువంటి పరిస్థితిలో చర్మం సున్నితంగా ఉంటే.. ఈ సిలికాన్ సాక్స్ ను ఉపయోగించకూడదు.
* ఎక్కువ రోజులు ఉపయోగించ వద్దు: సిలికాన్ సాక్స్‌లను ఎక్కువసేపు ధరించడం మంచిది కాదు. సిలికాన్ సాక్స్ లు ఎక్కువ సేపు వేసుకుంటే చెమట పట్టి చికాకుగా అనిపిస్తుంది. దీని వల్ల అనేక సమస్యలు వస్తాయి.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)