Today Horoscope (December 16, 2024):
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1)
ఉద్యోగంలో ఆశించిన స్థిరత్వం లభిస్తుంది. ఆదాయం కొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లో ఒకటి రెండు ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఆశించిన సంబంధం కుదురుతుంది. కుటుంబ జీవితం ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. ఎవరికీ హామీలు ఉండవద్దు.