రామ్ చరణ్ – బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో తాను నటించడం లేదని హీరో విజయ్ సేతుపతి స్పష్టం చేశారు. గతంలో బుచ్చిబాబు – వైష్ణవ్ తేజ్ కాంబినేషన్‌లో వచ్చిన ఉప్పెన చిత్రంలో విజయ్ సేతుపతి కీలక పాత్రను పోషించి, చిత్ర ఘన విజయంలో కీలక పాత్రను పోషించారు. ఈ నేపథ్యంలో సూరి, విజయ్ సేతుపతి, మంజు వారియర్ ప్రధాన పాత్రలుగా వెట్రిమారన దర్శకత్వంలో తెరకెక్కిన విడుదలై-2 చిత్రం ఈ నెల 20వ తేదీన తమిళం, తెలుగు భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్ నగరంలో జరిగింది.
ఇందులో విజయ్ సేతుపతి మాట్లాడుతూ, తాను రామ్ చరణ్ మూవీలో నటించట్లేదని స్పష్టం చేశారు. ఆ చిత్రంలో నటించేందుకు తనకు సమయం లేదన్నారు. పలు కథలు వింటున్నానని, ఏదైనా స్టోరీ బాగుంటే అందులోని హీరో క్యారెక్టర్ నచ్చడం లేదన్నారు. త్వరలోనే ఓ సినిమా సెట్ అయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. తెలుగు ప్రేక్షకుల ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేనంటూ గతంలో తనకు ఎదురైన ఓ అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. తనకు భాషా భేదం లేదని తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here