1993 లో విశ్వ విఖ్యాత నట సౌర్వభౌమ నందమూరి తారకరామారావు నటించిన’మేజర్ చంద్ర కాంత్’ చిత్రం ద్వారా బాలనటుడుగా సినీ ఆరంగ్రేటం చేసిన నటుడు మంచు మనోజ్.ఆ తర్వాత కూడా
బాలనటుడుగా తన తండ్రి మోహన్ బాబు నటించిన పలు సినిమాల్లో చేసిన మనోజ్ 2005 లో ‘సంతోషం’ మూవీ ఫేమ్ దశరధ్ దర్శకత్వంలో వచ్చిన ‘శ్రీ’ అనే మూవీతో సోలో హీరోగా మారాడు.బిందాస్, మిస్టర్ నూకయ్య,వేదం,రాజుభాయ్,గుంటూరోడు,కరెంటు తీగ వంటి పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల్లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాడు.
మనోజ్తన భార్య మౌనికరెడ్డి తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ లో చేరబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.వాటిల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియదు గాని మనోజ్ అండ్ మౌనికజనసేన లో చేరడం పక్కా అని అంటున్నారు. మనోజ్ కి గత కొన్ని రోజులుగా మోహన్ బాబు, విష్ణు ల మధ్య గొడవలు జరుగుతున్న నేపథ్యంలో జనసేన లో చేరే వార్త హాట్ టాపిక్ గా మారింది.
పవన్, మనోజ్ మధ్య ఎప్పటినుంచో మంచి అవినాభావ సంబంధం ఉంది. ఈ విషయాన్ని మనోజ్ చాలా సందర్భాల్లో చెప్పడం కూడా జరిగింది.ఇక మౌనిక రెడ్డి కూడా మొదటి నుంచి రాజకీయ కుటుంబానికి చెందిన ఆవిడే.