పుష్ప 2(pushpa 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటుగా ఆమె కుమారుడు శ్రీతేజ్ హాస్పిటల్ లో పదకొండురోజుల నుంచి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ దుర్ఘటనలో రేవతి మరణానికి అల్లుఅర్జున్ ని కూడా ఒక బాధ్యుడుగా చేసిన పోలీసులు రెండు రోజుల క్రితంఅల్లు అర్జున్ ని అరెస్ట్ చేసి జైల్లో కూడా ఉంచారు. ఆ తర్వాత హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో అల్లు అర్జున్ బెయిల్ పై విడుదల అవ్వడం జరిగింది

.

ఇక ప్రస్తుతం హాస్పిటల్ లో ఉన్న శ్రీ తేజ్(sri tej)పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పలువురు ప్రజా ప్రతినిధులు, మేధావులు శ్రీ తేజ్ ని కలిసి పరామర్శిస్తున్నారు.
ఇక అల్లు అర్జున్ కూడా బాబు ని పరామర్శించాలని అనుకుంటున్నా కూడా కోర్ట్ రూల్స్ ప్రకారం కలవలేకపోతున్నట్టుగా తెలుస్తుంది.ఇదే విషయాన్నీ సోషల్ మీడియా ద్వారా వెల్లడి చేసిన అల్లు అర్జున్ బాబు శ్రీ తేజ్ విషయంలో ఆందోళన చెందుతున్నానని, లీగల్ గా ఉన్న ప్రాబ్లమ్స్ వల్లే కలవలేకపోతున్నటుగా ‘ఎక్స్’ వేదికగాతెలియచేసాడు.ఇక శ్రీ తేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ అభిమానులతో పాటు పలువురు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here