ఎప్పుడూ కెమెరాల వెనక ఉండే దర్శక ధీరుడు రాజమౌళి హీరోలా రెచ్చిపోయాడు. వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగాఆ భార్యతో కలిసి డ్యాన్స్ అదరగొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు, హీరో శ్రీసింహ కొత్త జీవితం ప్రారంభించనున్నాడు. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటితో కలిసి వైవాహిక బంధంలోకి అడుగు పెట్టనున్నాడు. ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా సంగీత్ వేడుక గ్రాండ్ గా నిర్వహించారు. ఈ క్రమంలోనే సతీసమేతంగా అన్న కుమారుడి వివాహానికి హాజరయ్యారు జక్కన్న.
సంగీత్ లో భాగంగా భార్య రమా రాజమౌళతో కలిసి అదిరిపోయే స్టెప్పులేశారు. రవితేజ- పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన అమ్మానాన్న ఓ తమిళ అమ్మాయి సినిమాలోని ‘లంచ్‌కొస్తావా.. మంచ్‌కొస్తావా.. పాటకు స్టెప్పులేశారు రాజమౌళి. స్టేజీపై భార్యతో కలిసి రాజమౌళి మాస్ స్టెప్పులు వేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. శ్రీసింహ విషయానికి వస్తే.. రాజమౌళి తీసిన పలు సినిమాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించాడు. విక్రమార్కుడు, యమదొంగ, మర్యాద రామన్న సినిమాల్లో తళుక్కున మెరిశాడు శ్రీ సింహా. ఆ తర్వాత తెల్లవారితే గురువారం, దొంగలున్నారు జాగ్రత్త, ఉస్తాద్ తదితర సినిమాల్లో హీరోగా నటించాడు. ముఖ్యంగా ‘మత్తు వదలరా-1,2 సినిమాలతో క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు
ఇక ఎస్.ఎస్.రాజమౌళి విషయానికి వస్తే.. మహేశ్ బాబు హీరోగా ఓ యాక్షన్ అడ్వెంచర్ సినిమా పట్టాలెక్కింనున్నాడు. ఎస్‌ఎస్‌ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో మహేశ్ సరికొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇందుకోసం తన ఫిజిక్ ను కూడా పూర్తిగా మార్చేసుకున్నాడు మహేశ్. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియనున్నాయి.