కొంత మంది ఎంత కష్టపడి పని చేసినా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కదు. అది స్టూడెంట్స్ అయినా, ఉద్యోగులయినా సరే. ఇలా జరగడానికి కారణం జాతకంలో గ్రహాలు, రాశుల దోషాలు అని చేపవచ్చు. ముఖ్యంగా స్టూడెంట్స్ ఎంత కష్టపడినా సరే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో వెనుకబడి ఉంటారు. అటువంటి పరిస్థితిలో స్టూడెంట్స్ విజయానికి సహాయపడే కొన్ని జ్యోతిష్య పరిష్కారాలను గురించి తెలుసుకుందాం..

చదువులో ఉత్తీర్ణత సాధించాలని మంచి ఉద్యోగం పొందాలని ప్రతి స్టూడెంట్ కోరుకుంటాడు. అయితే కొన్నిసార్లు అర్హత సాధించిన తర్వాత కూడా గ్రహాలు, రాశులు లేదా దోషాల కారణంగా పోటీ పరీక్షలలో విజయం సాధించడంలో, ఉద్యోగం పొందడంలో ఇబ్బంది ఉంటుంది. గ్రహాలు,నక్షత్రాల దోషాల కారణంగా విద్యార్ధులు చదువులో వెనుకబడి ఉంటారు. అటువంటి పరిస్థితిలో వైఫల్యాన్ని నివారించడానికి జ్యోతిష్య గ్రంథాలలో పేర్కొన్న చర్యలను గురించి తెలుసుకుందాం..

జ్యోతిష్య శాస్త్రం, హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రంథాలలో పేర్కొన్న నియమాలను పాటించే వ్యక్తి జీవితంలో అడ్డంకులు తగ్గుతాయి. హిందూ మత విశ్వాసాల ప్రకారం గ్రంథాలలో పేర్కొన్న నియమాలను అనుసరించే వ్యక్తి జీవితం సంతోషంగా ఉంటుంది. గ్రంథాలలో పేర్కొన్న నియమాలను అనుసరించడం ద్వారా వ్యక్తి జాతకంలో బలమైన శక్తిని పొందుతాడు. వెంటనే ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. ప్రతికూలత దూరం అవుతుంది.

** అటువంటి పరిస్థితిలో జ్యోతిషశాస్త్రం ప్రకారం కొన్ని సులభమైన మంత్రాలు, సమర్థవంతమైన నివారణల గురించి తెలుసుకుందాం.. వీటిని పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలు లేదా ఉద్యోగాలకు ముందు స్టూడెంట్స్ పాటిస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు.

** జ్యోతిష్యుల ప్రకారం ఇంట్లో హనుమంతుడు ముందు దీపం వెలిగించండి. ఈ దీపాన్ని ఉదయం 9 గంటల లోపు వెలిగించాలి. మళ్ళీ సాయంత్రం ఏడు గంటల తర్వాత దీపం వెలిగించాలి. హనుమంతుని చిత్రపటాన్ని దక్షిణ దిశకు అభిముఖంగా ఉంచాలి. దీనితో పాటు హనుమాన్ చాలీసా, సంకట మోచన శ్రీ హనుమాన్ అష్టకం తప్పనిసరిగా రోజుకు ఒకసారి చదవాలి.

**స్టూడెంట్స్ రెండు బూందీ లడ్డూలు, తమలపాకులు తీసుకుని హనుమంతుడికి నైవేద్యంగా పెట్టి .. పనికి బయలుదేరాలి. పని విజయవంతం కావడానికి.. హనుమంతుడు సహాయం చేయాలని అభ్యర్థించండి. ప్రతిరోజూ హనుమాన్ చాలీసాను తప్పక పఠించండి

**రాగి పాత్రలో పసుపు కలిపిన నీటిని ప్రతిరోజూ సూర్యునికి అర్ఘ్యంగా సమర్పించండి.

**ఇంటర్వ్యూ రోజున బయలుదేరే ముందు “ఓం భూర్భువస్వః తత్స వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియోయోనఃప్రచోదయాత్” అనే గాయత్రీ మంత్రాన్ని 27 సార్లు జపించాలి. అనంతరం దేవుడికి లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి.. ఇంటర్వ్యూ రోజు పసుపు రంగు చొక్కా ధరించి ఇంటర్వ్యూకు వెళ్ళడం శుభప్రదం.

**జ్యోతిష్యం ప్రకారం కోరుకున్న ఉద్యోగం రావాలంటే తప్పనిసరిగా దానం చేయండి. అవసరమైన వారికి ఆహారం, బట్టలు లేదా డబ్బు దానం చేయాలి. ఇలా చేయడం వలన అనుకున్న పనిలో విజయానికి అవకాశాలు పెరుగుతాయి.

**నల్ల ఆవుకు ఆహారం అందించడం ముఖ్యంగా బెల్లం తినిపించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here