Fact Check: ఏదైనా వైరల్‌ కావాలంటే అది సోషల్‌ మీడియా అని చెప్పక తప్పదు. సోషల్‌ మీడియాలో వాస్తవాలే కాకుండా ఫేక్‌ న్యూస్‌ కూడా బాగా వైరల్‌ అవుతుంటాయి. ఇలాంటి వైరల్‌ పోస్టులను ప్రజలు నమ్మి మోసపోయే అవకాశం కూడా ఉంది. ఇటీవల బ్యాంకు అకౌంట్‌కు సంబంధించిన ఓ వార్త వైరల్‌ అవుతోంది.. ఇందులో నిజమెంతో తెలుసుకుందాం..

భారతదేశంలో చాలా మందికి బ్యాంకు అకౌంట్లు ఉన్నాయి. కొత్త ఆర్‌బీఐ నిబంధన వల్ల రెండు ఖాతాలు ఉన్నవారు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని కొద్ది రోజుల క్రితం ఓ పోస్ట్ వైరల్‌గా మారింది. అయితే ఆర్బీఐ (RBI) అటువంటి నిర్ణయం తీసుకుందా..? రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారిపై ఎలాంటి జరిమానా విధిస్తారు? ఇందులో నిజమెంత?

ఆర్‌బీఐ పేరుతో కొన్ని పోస్టులు వైరల్‌గా మారడంతో ఒకటి కంటే ఎక్కువ ఖాతాలు ఉన్నవారిలో గందరగోళం నెలకొంది. ప్రైవేట్ రంగ సంస్థల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు సామాన్య జనాలకు కూడా ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రైవేట్ సెక్టార్ ఉద్యోగులు ఒక కంపెనీలో ఉద్యోగం వదిలేసి మరో కంపెనీకి వెళ్లినప్పుడు మరో కంపెనీ వారి నిబంధనల ప్రకారం కొత్త బ్యాంకు ఖాతాను తెరుస్తుంది. దీంతో కొంతమంది ఉద్యోగులకు 4 నుంచి 5 బ్యాంకు ఖాతాలు కూడా ఉన్నాయి. ఆర్‌బీఐ పేరుతో వైరల్‌ అవుతున్న ఈ వార్తలపై నిజమెంతో తెలుసుకుందాం.

మీకు ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉంటే జరిమానా విధించే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ క్లెయిమ్‌లో ఆర్‌బిఐ మాజీ గవర్నర్ శక్తికాంత దాస్‌ను ఉద్దేశించి ఆర్‌బిఐ కొత్త మార్గదర్శకాలను జారీ చేసినట్లు ఇందులో ఉంది. దీని ప్రకారం రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్న వ్యక్తులు పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుందని వైరల్‌ అవుతున్న వార్త సారాంశం.

ఇందులో నిజమెంత?

PIB ఈ క్లెయిమ్‌ను వాస్తవంగా తనిఖీ చేసి, రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంక్ ఖాతాలు ఉంటే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుదనే వార్తలో ఎలాంటి నిజం లేదని పీఐబీ ప్యాక్ట్‌ చెక్‌ స్పష్టం చేసింది. దీనికి సంబంధించి ఆర్‌బిఐ ఎటువంటి సర్క్యులర్‌లు లేదా మార్గదర్శకాలను జారీ చేయలేదు. అందుకే రెండు లేదా అంతకంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉంటే జరిమానా విధిస్తారనే అంశం పూర్తిగా అబద్దమని స్పష్టం చేసింది.

ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలను తెరవవచ్చు?

భారతదేశంలో ఒక వ్యక్తి ఎన్ని బ్యాంకు ఖాతాలను తెరవవచ్చనే విషయంలో ఎటువంటి నియమం లేదు. భారతదేశంలో ఒక వ్యక్తి తెరవగల బ్యాంకు ఖాతాల సంఖ్యపై పరిమితులు లేవు. మీ అవసరాన్ని బట్టి ఖాతాలో ఓపెన్‌ చేసుకోవచ్చు. ఆర్‌బీఐ కూడా ఎలాంటి పరిమితి విధించలేదు. అయితే, ప్రతి బ్యాంకు నిబంధనల ప్రకారం.. మీరు ప్రతి బ్యాంకు ఖాతాలో కనీస మొత్తాన్ని ఉంచాలి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here