ఇళయరాజా సంగీతాన్ని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎన్నో అద్భుతమైన పాటలను అందించారు ఈ మ్యూజిక్ మ్యాస్ట్రో. తాజాగా ఇళయరాజాకు సంబందించిన ఓ సంఘటన ఇప్పుడు వివాదానికి దారితీసింది. ఆయనను ఆలయంలోపానికి రాకుండా సిబ్బంది అడ్డుకోవడం చర్చకు దారితీసింది. దీని పై ఇళయరాజా క్లారిటీ ఇచ్చారు.
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా పేరు తాజగా వార్తల్లో ఎక్కువగా వినిపిస్తుంది. తాజాగా ఆయనను ఆలయ అధికారులు అడ్డుకోవడం వివాదంగా మారింది. శ్రీవిల్లిపుత్తూరు ఆండాళ్ ఆలయంలో సంగీత విద్వాంసుడు ఇళయరాజాను ఆలయ అధికారులు ఆపారు. ఆలయంలోకి ప్రవేశించిన ఆయనను వెనక్కి పంపడం పెద్ద వివాదానికి దారితీసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఇళయరాజాకు అనుకూలంగా.. కొందరు.ఆయనకు వ్యతిరేకంగా పలువురు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అక్కడ జరిగింది వేరు.. నెటిజన్స్ అర్ధం చేసుకుంది వేరు. ఇళయ రాజాతో పాటు అక్కడ జీయర్స్ కూడా ఉన్నారు. ఆలయ నియమాల ప్రకారం.. మండపంలోకి కేవలం జీయర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది.
అయితే ఇళయరాజా తెలియక జీయర్లతో కలిసి లోనికి వచ్చారు. దాంతో ఆలయ సిబ్బంది ఆయనకు ఆలయ నియమాలు వివరించారు. దాంతో ఆయన బయటకు వచ్చేశారు. అయితే ఇప్పుడు ఈ ఘటనపై స్వయంగా ఇళయరాజా స్పందిస్తూ తనపై కొందరు పుకార్లు పుట్టిస్తున్నారని, అలాంటిదేమీ జరగలేదని, తన ఆత్మగౌరవాన్ని తాను ఎప్పుడూ తక్కువ చేసుకోనని అన్నారు. సోషల్ మీడియాలో షేర్ చేసిన నోట్లో ఇళయరాజా ఇలా రాసుకొచ్చారు..
‘‘కొందరు నాపై తప్పుడు పుకార్లు ప్రచారం చేస్తున్నారు. నేను నా ఆత్మగౌరవం విషయంలో రాజీ పడేవాడిని కాదు, ఎప్పటికీ అలా ఉండను. జరగని విషయాలను ప్రచారం చేస్తున్నారు. అభిమానులు, ప్రజలు ఈ పుకార్లను నమ్మవద్దు. అంటూ ఇళయరాజా’ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.