రాష్ట్ర అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య వాడివేడి చర్చ నడించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి 27 లక్షల 208 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు.
తెలంగాణ అసెంబ్లీలో వినూత్న రీతిలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. లగచర్ల ఘటనపై నిన్న చర్చకు అనుమతించకపోవడంతో నిరసన తెలియజేస్తూ బ్లాక్ షర్ట్‌లతో అసెంబ్లీకి వచ్చారు. లగచర్ల రైతుకు బేడీలు వేసిన ఘటనకు నిరసనగా తమ చేతులకు బేడీలు వేసుకొని వచ్చారు. అటు ఎమ్మెల్సీలు కూడా నల్ల దుస్తులు ధరించి మండలికి చేరుకున్నారు.
ఇది ఇలా ఉంటే రాష్ట్ర అప్పులపై తెలంగాణ అసెంబ్లీలో మాజీ మంత్రి హరీష్ రావు, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మధ్య వాడివేడి చర్చ నడించింది. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. ఏడాదిలో రాష్ట్ర ప్రభుత్వం కోటి 27 లక్షల 208 కోట్ల రూపాయల అప్పు చేసిందన్నారు. ఈ లెక్కన వచ్చే ఐదేళ్లలో 6 లక్షల 36 వేల కోట్ల అప్పు చేయబోతుందన్నారు. తమ పాలనలో చేసిన అప్పులపై రాష్ట్ర ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. దీనికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్ నేతలు సభను తప్పుదోవ పట్టిస్తున్నారని భట్టి అన్నారు. ప్లకార్డులు తీసుకురావద్దని రూల్స్ బుక్‌లో స్పష్టంగా ఉందని, ఆర్ఎస్ నేతలు సభ హక్కులను ఉల్లంఘించారని ఆయన పేర్కొన్నారు.
FRBM రుణ పరిమితిపై అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో కాంగ్రెస్ బీఆర్‌ఎస్ మధ్య మాటలయుద్ధం జరిగింది. అప్పుల వివరాలను భట్టి విక్రమార్క వెల్లడించారు. 2024 నవంబర్ వరకు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చిన రుణాలు 51వేల 200 కోట్లు అని తెలిపారు. భట్టి వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీష్‌రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. అప్పులపై ప్రభుత్వ పెద్దలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భట్టి విక్రమార్కను హరీష్‌రావు డిప్యూటీ స్పీకర్ అంటూ సంబోధించారు. ఈ విషయాన్ని స్పీకర్ గుర్తుచేశారు.
మళ్లీ హరీష్‌రావు అలాగే నోరుజారారు. అంతేగాదు, భట్టి సీఎం కావాలని కోరుకుంటున్నట్లు హరీష్‌రావు చెప్పారు. అప్పులపై ప్రత్యేక చర్చకు బీఆర్‌ఎస్ సిద్ధమా? అని భట్టి బీఆర్‌ఎస్ నాయకులకు సవాల్ విసరగా.. భట్టి సవాలును స్వీకరిస్తున్నాం.. చర్చకు సిద్ధమే అని హరీష్‌రావు తెలిపారు.