ఖమ్మం జల్లాలో దానవాయి గూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. ఓ విద్యార్థిని పలు మార్లు ఎలుక కరవడంతో రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. దీనితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలు చెయ్యి చచ్చు పడిపోయి నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
ఖమ్మం దానవాయి గూడెం బీసీ వెల్ఫేర్ గురుకులంలో దారుణం జరిగింది. 10 వ తరగతి విద్యార్థిని లక్ష్మి భవానిని ఎలుక కరిచింది. మార్చి నుంచి నవంబర్ మధ్యలో పలు మార్లు ఎలుక కరవడంతో రేబిస్ వ్యాక్సిన్ వేయించారు. దీనితో తీవ్ర అస్వస్థతకు గురైంది. కాలు చెయ్యి చచ్చు పడిపోయి నడవలేని స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. గురుకుల సిబ్బంది నిర్లక్ష్యం మేనని తల్లి తండ్రులు,రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి.
కాలు చెయ్యి చచ్చు పడిపోయి నడవలేని స్థితిలోకి ఉన్న విద్యార్థిని భవానీ కీర్తి ఖమ్మం మమత ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఖమ్మం ముస్తఫానగర్‌కు చెందిన ఎస్.లక్ష్మీ భవాని కీర్తి ఖమ్మం శివారులోని దానవాయిగూడెం బీసీ గురుకుల బాలికల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. వారం రోజుల క్రితం తన కాళ్లు, చేతులు లాగుతున్నాయని తనకు ఫోన్ చేసి చెప్పడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించినట్లు తల్లి తెలిపారు. తన కుమార్తెకు కుడి కాలు, ఒక చెయ్యి చచ్చుబడిపోయాయని.. గురుకులంలో ఎలుకలు బాగా ఉన్నాయని.. వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ ఘటనలు తరచూ జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
ఈ ఘటనపై విద్యార్థిని తల్లితండ్రులు, బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో ఉన్న ఆ బాలికిను పరామర్శించారు. ప్రభుత్వం ఆర్భాటంగా గురుకుల బాటపట్టిన కానీ.. గురుకులంలో తరచూ ఎలుకలు కరుస్తున్నా..పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.