పుష్ప 2 (pushpa 2)ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎన్నో సంచలన రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది.ఈ విషయంలో అభిమానులు ఆనందంగా ఉన్నా కూడా,అల్లుఅర్జున్ తో పాటు చిత్ర యూనిట్ మాత్రం సంతోషం లేదు.ఈ విషయాన్నీ అల్లు అర్జునే స్వయంగా చెప్పాడు.ఇందుకు కారణం సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి అనే మహిళ మరణంతో పాటు,ఆమె కుమారుడు శ్రీ తేజ్(sri tej) హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఉండటమే.

ఇక ఈ విషయంలో అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసి జైలుకి పంపించడంతో,అభిమానులు సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేసారు.ఒక అభిమాని అయితే ఏకంగా జైలు వద్దకెళ్లి అల్లు అర్జున్ ని విడుదల చెయ్యాలంటూ ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య కి కూడా ప్రయత్నించాడు.ఇక అరెస్ట్ విషయంలో కొంత మంది అభిమానులు కాంట్రవర్సీగా,రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్టుగా తెలుస్తుంది.ఒక ఫంక్షన్ లో సీఎం రేవంత్ పేరుని,అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడంటూ కూడా పోస్టులు పెట్టడంతో పోలీసులు సీరియస్ గా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.ఇందులో భాగంగా పలువురు అభిమానులు పెట్టిన కాంట్రవర్సీ పోస్టులపై నాలుగు  కేసులు నమోదు అయినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి.

ఇక తొక్కిసలాట ఘటనలో గాయపడిన  శ్రీతేజ్ కి  సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తొంది.బ్రెయిన్ దగ్గర చాలా డ్యామెజ్ జరగడంతో పాటుగా,ఆహారాన్ని పైపుల ద్వారా అందిస్తున్నట్లు డాక్టర్స్ ఒక హెల్త్ బులిటెన్ లాంటిది కూడా విడుదల చేసారు. శ్రీ తేజ్ ఆరోగ్యం బాగుండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.శ్రీతేజ్ హాస్పిటల్ కి అయ్యే ఖర్చు మొత్తాన్ని ప్రభుత్వమే చూసుకుంటుంది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here