షణ్ముఖ్ జశ్వంత్ సోషల్ మీడియాలో ఈ పేరు ఒకప్పుడు చాలా పాపులర్.  షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ యూట్యూబ్ స్టార్ గా ఒక ఫ్యాన్ బేస్ ని తయారు చేసుకున్నాడు. సాఫ్ట్వేర్ డెవలపర్ మూవీ బాగా వ్యూస్ సంపాదించుకుంది. ఐతే  కానీ కొన్ని నెలలుగా అడియన్స్ తో కనెక్ట్ కావడం లేదు షణ్ముఖ్.  ఎందుకంటే తన పర్సనల్ లైఫ్ చాలా డిస్టర్బెన్స్ లోకి వెళ్లడం ఆ తర్వాత పోలీస్ కేసులు వంటి వాటితో ఎక్కువగా వార్తలలో నిలిచాడు. షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న టైములో దీప్తి సునైనాతో ప్రేమలో ఉన్నాడు. కానీ ఆతర్వాత బిగ్ బాస్ సీజన్ 5లోకి వెళ్లిన షన్నూ అక్కడ ఇష్యూస్ తో దీప్తితో లవ్ బ్రేకప్ చేసుకునే పరిస్థితి వచ్చింది.

ఐతే చాన్నాళ్లకు “లీలా వినోదం” మూవీతో కం బ్యాక్ ఇచ్చారు. ఇక ఈ మూవీ హీరో-హీరోయిన్స్ షణ్ముఖ్, అనఘ కాకమ్మ కథలు ఎపిసోడ్ కి గెస్టులుగా వచ్చారు. అందులో షణ్ముఖ్ తన గురించి చెప్పుకొచ్చాడు. “ఫస్ట్ లవ్ విషయంలో ఒక పాయింట్ తర్వాత సూసైడ్ చేసుకుందామనుకున్నా. అందరి కంటే ఎక్కువగా మా పేరెంట్స్ బాగా బాధపడ్డారనిపించింది. వాళ్ళ మీద నేను నా ప్రేమను చూపించుకుని పరిస్థితి లేకుండా పోయింది. ఎందుకంటే నేను అదే సమయానికి డిప్రెషన్ లో ఉన్నానని చెప్తున్నా. నా దగ్గరేం డబ్బులు లేవు. నాకు మా నాన్న ఎప్పుడూ మెంటల్ సపోర్ట్ ఇచ్చారు. మా ఫామిలీ కొన్ని ఇష్యూస్ వల్ల చాలా చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను నా తప్పును తీసుకుంటా…కానీ అన్ని తప్పులు నేనే చేశాను అంటే ఊరుకోను. ఎందుకంటే నా ఫామిలీని పైకి తీసుకువచ్చేది నేనే.” అని చెప్పాడు షణ్ముఖ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here