డబ్బుల కోసం ఇద్దరు మహిళలు చేసిన పనిని తెలుస్తే అందరూ షాక్ అవుతారు. డబ్బుల కోసం ఇద్దరు మహిళలు వాళ్ల భర్తలు బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించుకొని రైతు బీమా డబ్బులు కాజేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? వారు పోలీసులకు ఎలా చిక్కారు?
ప్రపంచాన్ని నడిపిస్తుంది డబ్బు.. ప్రతి ఒక్కరు కష్టపడేది డబ్బు కోసమే..కానీ డబ్బుల కోసం కొంతమంది దారుణాలకు ఒడిగడుతున్నారు.. డబ్బుల కోసం ఇద్దరు మహిళలు చేసిన పనిని తెలుసుకొని అందరూ ముక్కున వేలు వేసుకుంటున్నారు. ఇద్దరు రైతులు తాము బతికుండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించుకొని రైతు బీమా డబ్బులు కాజేశారు. దీనికి కర్త, కర్మ, క్రియ అన్ని వాళ్ల భార్యలే.. అయితే వీళ్ళు చేసిన ఈ మోసం కొంత ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే .. మెదక్ జిల్లా గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన పిట్ల శ్రీను 2021లో చనిపోయినట్లు అతడి భార్య జ్యోతి విలేజ్ సెక్రటరీ నుంచి డెత్ సర్టిఫికెట్ తీసుకుంది.
దీని ఆధారంగా రైతు బీమా కోసం అప్లై చేయగా, ఎల్‌ఐసీ నుంచి రూ. 5 లక్షలు మంజూరు కావడంతో వాటిని తీసుకుంది. అలాగే అదే గ్రామానికి చెందిన ఎలిగడి మల్లేశం అనే వ్యక్తి కూడా 2023లో చనిపోయినట్లు అతడి భార్య శేఖవ్వ డెత్ సర్టిఫికెట్ తీసుకొని రైతు బీమాకు అప్లై చేసుకోవడంతో ఆమెకు కూడా రూ. 5 లక్షలు మంజూరు అయ్యాయి. అయితే వచ్చిన డబ్బులతో వీళ్ళు జాలిగా ఉంటున్న సమయంలో అనుమానం వచ్చిన కొంతమంది గ్రామస్థులు తీగలాగగా, డొంక మొత్తం కదిలింది. అసలు విషయం తెలుసుకోని పిట్ల శ్రీను, ఎలిగడి మల్లేశం బతికే ఉన్నప్పటికీ డెత్ సర్టిఫికెట్లు తీసుకొని రైతు బీమా పొందారనిఈ నెల 14వ తేదీన గుట్టకిందిపల్లి గ్రామానికి చెందిన కొంతమంది స్థానిక ఏఈవోకి సమాచారం ఇచ్చారు. దీంతో ఏఈవో గ్రామానికి వెళ్లి ఎంక్వైరీ చేయగా శ్రీనివాస్, మల్లేశం ఇద్దరూ కూడా బతికే ఉన్నట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆ ఏఈవో మెదక్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. ఏది ఏమైనా డబ్బుల కోసం ఇద్దరు మహిళలు చేసిన పనిని చూసి అందరూ అవాక్కు అయ్యారు.