మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు చేసిన ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశమైంది.
ఫార్ములా ఈ రేస్ కుంభకోణంపై కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గానే ఉంది. ఎసిబి విచారణ చేపట్టాలని ప్రభుత్వ ప్రదానకార్యదర్శి శాంతకుమారి ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే. కెటీఆర్ మెడకు ఫార్ములా ఈ రేస్ కుంభకోణం చుట్టుకుంది. ఈ కుంభకోణంపై ఎసిబి విచారణకు మంత్రివర్గం పట్టు బట్టింది. విద్యుత్ కొనుగోళ్లు, పవర్ ప్లాంట్ కొనుగోళ్లపై జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ గా ఉంది. జస్టిస్ మదన్ బి లోకూర్ ఇచ్చిన నివేదికపై కేబినేట్ భేటీ జరిగింది. కెసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఇస్టా రాజ్యంగా వ్యవహరించారు. కల్వంకుంట్ల ఫ్యామిలీ కోసమే పెద్ద పీట వేశారు. అవినీతి, బంధు ప్రీతి వల్ల రాష్ట్ర ప్రజల నెత్తిన భారం పెట్టారు. రాబోయే 25 ఏళ్ల పాటు కెసీఆర్ చేసిన అప్పులకు వడ్డీలు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని జస్టిస్ మదన్ బి లోకూర్ తేల్చేశారు. కాలం చెల్లిన టెక్నాలజీతో ఏర్పడిన భద్రాది పవర్ ప్లాంట్ తో రానున్న 25 ఏళ్లలో 9 వేల కోట్ల అదనపు భారం ప్రజలపై పడింది. చత్తీస్ గడ్ తో చేసుకున్న విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం వల్ల 3, 642 కోట్ల నష్టం వాటిల్లిందని కమిషన్ తేల్చి చెప్పింది. యూనిట్ మూడు రూపాయల అరవై పైసలకు కొనుగోలుచేసిన ప్రభుత్వం ఇంధన సర్దుబాటు పేరిట ఏడురూపాయలకు కొనడాన్ని కేబినెట్ ఆక్షేపించింది. మంత్రి పొంగులేటి సియోల్ పర్యటనలో ఉన్నప్పుడు దీపావళి తర్వాత పొలిటికల్ బాంబులు పేలతాయి అని ప్రకటించారు. ఫార్ములా ఈ రేస్ పై అవినీతినిరోధక శాఖ దర్యాప్తు చేపట్టడమే గాకుండా కెసీఆర్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కూడా దర్యాప్తు చేస్తే నేరం రుజువౌతుంది. దర్యాప్తు తర్వాత తండ్రి కొడుకులు అరెస్ట్ అయ్యే అవకాశముందని చర్చ జరుగుతుంది.