నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్‌ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీఆర్‌, A-2గా అరవింద్‌ కుమార్‌, A-3గా BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) పీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు.

తెలంగాణ పాలిటిక్స్‌లో అతిపెద్ద సంచలనం.. మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుపై కేసు నమోదు అయ్యింది. ఫార్ములా-ఈ కార్‌ రేసింగ్‌ వ్యవహారంలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ ఏసీబీ అధికారులు కేసు నమోదు చేశారు. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 13(1)A, 13(2) పీసీ యాక్ట్‌ కింద కేసులు నమోదు అయ్యాయి. మరో రెండు కేసులు 409, 120B సెక్షన్లను చేర్చారు.

నాలుగు సెక్షన్లు నాన్‌బెయిలబుల్‌ కేసులే పెట్టిన ఏసీబీ అధికారులు, A-1గా కేటీఆర్‌, A-2గా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఐఏఎస్‌ అధికారి అరవింద్‌ కుమార్‌, A-3గా హెచ్‌ఎండీఏ చీఫ్‌ ఇంజినీర్‌ BLN రెడ్డి పేర్లను చేర్చారు. అధికార దుర్వినియోగం కింద ప్రివెన్షన్‌ ఆఫ్‌ కరప్షన్ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. మాజీ మంత్రి కేటీఆర్‌పై విచారణకు ఇటీవల గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ అనుమతి ఇవ్వడంతో..ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని సీఎస్‌ శాంతి కుమారి ఏసీబీకి లేఖ రాశారు. దీంతో తాజాగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌పై కేసులు నమోదు చేశారు.

RBI మార్గదర్శకాలకు విరుద్దంగా FEO సంస్థకు నిధులు బదలాయింపు చేసినట్లు ఆరోపించింది. భారతీయ కరెన్సీలో విదేశీ సంస్థకు రూ.46 కోట్ల మేర నిధులు చెల్లించినట్లు ప్రస్తావించింది. RBI అనుమతి లేకుండా చెల్లించడంపై రూ.8 కోట్ల పెనాల్టీని రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత RBI పెనాల్టీ చెల్లింపు జరిపింది. RBI పెనాల్టీతో ఈ రేస్‌ స్కామ్‌ తో బట్టబయలు అయ్యింది. రాష్ట్ర కేబినెట్‌ అనుమతి లేకుండా సొంత నిర్ణయంతో HMDA బోర్డు నుంచి కేటీఆర్‌ ఆదేశాలతో డబ్బులు చెల్లించారు అధికారులు. అంతేకాదు గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ అనుమతి లేకుండా ఆదేశాలు ఇచ్చినట్లు ఏసీబీ పేర్కొంది. ఫైనాన్స్‌ సెక్రటరీ క్లియరెన్స్‌ లేకుండానే నిధుల విడుదల అయ్యినట్లు గుర్తించారు. ఎన్నికల కోడ్‌ ఉన్న సమయంలో ఎవరి అనుమతి లేకుండానే చెల్లింపులు జరిపినట్లు ఏసీబీ పేర్కొంది.

కేటీఆర్‌పై నమోదైన కేసులు ఇవేః

13(1)A పీసీ యాక్ట్‌ — ఉద్దేశపూర్వకంగా నేరపూరిత చర్యలకు పాల్పడటం.

13(2) పీసీ యాక్ట్‌ కింద కేసులు — ప్రభుత్వ ప్రతినిధి అధికార దుర్వినియోగానికి పాల్పడితే అమలు చేసే సెక్షన్‌.

— సెక్షన్‌ 409 కింద కేసు — నేరపూరిత విశ్వాస ఉల్లంఘన కింద కేసు నమోదు

— 120B కింది కూడా కేసు నమోదు — ఒప్పందంలో కుట్రపూరితంగా వ్యవహరించడం

కాగా నేరం రుజువైతే ఏడాది నుంచి ఏడేళ్ల వరకూ జైలుశిక్ష పడే అవకాశముంది.

ఇదిలావుంటే, కేటీఆర్ మీద నమోదైన కేసుపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో స్పందించారు. రాష్ట్ర ప్రతిష్టను పెంచడానికి ఈ ఫార్ములా రేసు నిర్వహించామన్నారు. చెల్లింపులు కూడా పారదర్శకంగా జరిగాయని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే గొంతు నొక్కడానికి కేసులు పెడుతున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ఫార్ములా రేస్‌పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here