• ఏ2 గా ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌
  • నాన్ బెయిల్ బుల్ కేసు
  • 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు
  • శుక్రవారం అరెస్ట్ చేసే ఛాన్స్
  • వరస సెలవులు.. బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు లేవు
  • ఒప్పందం పారదర్శకం – కేటీఆర్
  • పూర్తి బాధ్యత తనదేనంటూ కేటీఆర్ ప్రకటన
  • ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.

ఫార్ములా-ఈ కార్ రేసింగ్‌పై ఏసీబీ కేసు న‌మోదు చేసింది. బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఏ1గా, ఐఏఎస్ ఆఫీస‌ర్ అర‌వింద్ కుమార్‌ను ఏ2గా పేర్కొంటూ ఎఫ్ఐఆర్ న‌మోదు చేసిన‌ట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఓ ప్ర‌యివేటు కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు ఏసీబీ అధికారులు. అయితే ఇప్పుడు ఏసీబీ అధికారులు ఏం చేయబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది. తొలుత కేటీఆర్ ను విచారణకు పిలుస్తారా? లేక తమ దర్యాప్తులో తేలిందని నేరుగా అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటిస్తారా? అని సోషల్ మీడియాలో అనేక రకాల ప్రశ్నలు కనిపిస్తున్నాయి. అయితే కేటీఆర్ పై ఏసీబీ అధికారులు క్రిమినల్ కేసులతో పాటు నాన్ బెయిల్ బుల్ కేసులను ఏసీబీ నమోదు చేయడం ఇప్పుడు పార్టీలోనూ, రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ కేసు విషయంలో ఏసీబీ అధికారులు ప్రాధమిక విచారణ పూర్తి చేశారు.

నాన్ బెయిల్ బుల్ కేసు

ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ తో పాటు ప్రైవేట్ కంపెనీ సీఈవో బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు అయింది. ఈ కేసులో ఏ వన్ నిందితుడి గా కేటీఆర్ గా ఉండటం, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారని అభియోగం మోపడంతో ఆయనను తొలుత ఏసీబీ అధికారులు విచారణకు పిలవనున్నారు. విచారణ నాలుగైదు రోజులు పాటు జరుగుతుందా? లేక రేపు శుక్రవారం కావడంతో కేసులో విచారణకు పిలిచి అరెస్ట్ చేస్తారా? అన్నది ఉత్కంఠగా మారింది. కేటీఆర్‌పై నాలుగు సెక్షన్ల కింద ఏసీబీ అధికారులు నమోదు చేయడంతో పాటు 13 (1) A, 13 (2) పీసీ యాక్ట్‌, 409, 120B కింద కేసు నమోదు చేశారు. ఈ రోజు నోటీసులు ఇచ్చి రేపు విచారణకు పిలిపించి ఏసీబీ అధికారులు అదుపులో తీసుకుంటారన్న ప్రచారమూ జోరుగా సాగుతుంది.

వరస సెలవులు..

శుక్రవారం కావడంతో పాటు వరసగా ఇక క్రిస్మస్ సెలవులు కూడా న్యాయస్థానాలకు ఉండటంతో ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు కూడా లేవని కొందరు చెబుతున్నారు. ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ హెచ్ఎండీఏ నుంచి యాభై రెండు కోట్ల రూపాయల నిధులను కంపెనీకి విడుదల చేశారని, దీనిపై తొలుత విచారణకు పిలుస్తారని అంటున్నారు. ఈ ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో పూర్తి బాధ్యత తనదేనంటూ గతంలోనే కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ నిధులు విడుదల చేయడానికి మంత్రివర్గం ఆమోదం అవసరం లేదని కూడా ఆయన అన్నారు. తాను అరెస్ట్ కావడానికి కూడా సిద్ధంగా ఉన్నానని కేటీఆర్ చెబుతూ వస్తున్నారు. తనపై నమోదయిన కేసులను న్యాయపరంగా మాత్రమే ఎదుర్కొంటానని, జైల్లో పెడితే ఫిట్ గా మారి బయటకు వస్తానంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలుకూడా ఈ సందర్భంగా చర్చకు వస్తుంది. మరోవైపు ఈకేసు విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఈ కేసులో పూర్తిస్థాయివిచారణ జరిపి, అన్ని ఆధారాలను సేకరించిన తర్వాత మాత్రమే ఏసీబీ అధికారులు యాక్షన్ కు దిగే అవకాశముందనికూడా చెబుతున్నారు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారంతో తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా మారనున్నాయి.

కేటీఆర్ పై మరో కేసు

ఓఆర్ ఆర్ టెండర్లపై సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం..

కేటీఆర్ టార్గెట్ గా తెలంగాణ సర్కార్ దూకుడు పెంచింది. కేటీఆర్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏ-1గా కేటీఆర్ ఉన్నారు. ఓఆర్ఆర్ అంశంలోనూ కేటీఆర్ టార్గెట్ గా సర్కార్ చర్యలకు సిద్ధమవుతోంది. ఓఆర్ఆర్ లీజుపై సిట్ కొరడా ఝళిపించింది. సిట్ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఏసీబీ, సిట్ స్పీడ్ తో కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.

”ఈరోజు మాజీ ఆర్థిక శాఖ మంత్రే డిమాండ్ చేశారు. ఈ ఔటర్ రింగ్ రోడ్ అమ్మకం మీద మీరు విచారణ వేయండని డిమాండ్ చేశారు. వారు మనస్ఫూర్తిగా విచారణకు అడిగారో.. వారి కోరిక మేరకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేస్తాం. ప్రధాన ప్రతిపక్షం కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ కు సంబంధించి ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టిన విధానాల మీద ఈ సభ ద్వారా ఈ సభ్యులందరి ఆమోదంతో విచారణకు ఆదేశిస్తున్నా. హరీశ్ రావు కోరిక మేరకు ఔటర్ రింగ్ రోడ్ టెండర్ విషయంలో పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నా” అని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.

కేటీఆర్ పై నాలుగు కేసులు పెట్టె అవకాశం

  • ఫార్ములా ఈ కార్ రేస్ కేసు
  • లగచర్ల కేసు
  • ఓఆర్ ఆర్ టెండర్ల కేసు
  • ఫోన్ ట్యాపింగ్ కేసు

కేటీఆర్ను విచారించేందుకు ACB స్పెషల్ టీం

కేటీఆర్ను విచారించేందుకు.. అందుకు కావాల్సిన ఏర్పాట్లపై ACB DG విజయ్ కుమార్ ప్రత్యేకంగా చర్చించారు. 2024, డిసెంబర్ 19వ తేదీ సాయంత్రం.. బంజారాహిల్స్లోని ఏసీబీ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసు విచారించేందుకు స్పెషల్ టీం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారాయన.

ఈ కేసులో కేటీఆర్ A1 కావటంతో.. మొదటగా ఆయననే విచారించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే విచారణకు సంబంధించి ఏసీబీ అధికారులు సిద్ధం అవుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here