అక్టోబర్ 31, 2024 నాటికి భారతమాల పరియోజన పథకం కింద కేంద్రప్రభుత్వం నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.

భారతమాల పరియోజన పథకం కింద అక్టోబర్ 31, 2024 నాటికి మొత్తం 26,425 కి.మీ పొడవున హైవే ప్రాజెక్టులు మంజూరు చేసినట్లు రోడ్డు రవాణా & రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 18,714 కి.మీ హైవే ప్రాజెక్టులు నిర్మించినట్లు చెప్పారు. భారతదేశంలో కనెక్టివిటీని మెరుగుపరచడానికి, లాజిస్టిక్ ఖర్చును తగ్గించడానికి 34,800 కి.మీ పొడవుతో కూడిన భారతమాల పరియోజన 2017లో భారత ప్రభుత్వం ఆమోదించబడింది. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు భారతమాల పరియోజన కింద రూ. 4.72 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టిందని ఆయన పేర్కొన్నారు.

అలాగే పోర్టు, కోస్టల్ కనెక్టివిటీ రోడ్ల కేటగిరీ కింద 424 కి.మీ పొడవుతో 18 ప్రాజెక్టులు మంజూరు కాగా ఇప్పటి వరకు 189 కి.మీ నిర్మించామని తెలిపారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌తో సహా వివిధ తీరప్రాంత రాష్ట్రాల్లోని వివిధ పెద్ద చిన్న ఓడరేవులకు భారత్‌మాల పథకం కింద వివిధ ప్రాజెక్టులు కనెక్టివిటీని అందిస్తున్నాయన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా నితిన్ గడ్కరీ మాట్లాడుతూ.. ఈశాన్య ప్రాంతంలోని జాతీయ రహదారులపై (ఎన్‌హెచ్‌లు) రూ.81,540 కోట్లతో మంజూరైన మొత్తం 3,856 కిలోమీటర్ల పొడవుతో 190 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయని చెప్పారు.

నిర్మాణంలో ఉన్న పనులన్నీ సెప్టెంబరు 2028 నాటికి పూర్తి చేయడానికి షెడ్యూల్ చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలోని అన్ని NH పనులకు రాష్ట్రాల వారీగా, సంవత్సరం వారీగా కేటాయింపులు చేయబడతాయన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఈశాన్య ప్రాంతంలో ఎన్‌హెచ్ పనుల కోసం మొత్తం రూ.19,338 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. వీటిలో భూసేకరణను క్రమబద్ధీకరించడం, వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని పునరుద్ధరించడం వంటివి ఉన్నట్లు సభలో తెలియజేశారు. తదుపరి జాప్యాన్ని నివారించేందుకు భూసేకరణ, అనుమతుల విషయంలో తగిన సన్నద్ధతతో ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు వెల్లడంచారు. పనిని వేగవంతం చేయడానికి వివిధ స్థాయిలలో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పరిధి మార్పు, గడువు పొడిగింపు ప్రతిపాదనల ఆమోదం కూడా వేగంగా జరుగుతోందన్నారు. అంతేకాకుండా, పనుల మంజూరుకు ముందు నెట్‌వర్క్ ప్లానింగ్ గ్రూప్ మదింపు జరుగుతోందని, తద్వారా ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమస్యలను ముందుగా గుర్తించిన క్లియరెన్స్‌లు, పరిష్కారానికి ముందుగానే పని చేయవచ్చని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here