సోషల్ మీడియా ద్వారా తెలంగాణ జానపద గీతాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ,ఫోక్ సింగర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయని శృతి.(shruthi)పేరడీ సాంగ్స్ పాడటంలో కూడా పాపులర్ అయిన శృతి ఎంతో మంది అభిమానులని కూడా సంపాదించుకుంది.అలాంటి ఆమె ఇప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం సంచలనం సృష్టిస్తుంది.

కరీంనగర్ జిల్లాకి చెందిన శృతి కి నెలరోజుల క్రితం ఇనిస్టాగ్రమ్ ద్వారా సిద్దిపేట జిల్లా పీర్లపల్లికి చెందిన దయాకర్ తో పరిచయం ఏర్పడింది.ఆ పరిచయం ప్రేమగా మారడంతో  ఇరు కుటుంబాల పెద్దలకి తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్నారు.ఆ తర్వాత పీర్లపల్లి లోనే నివాసం ఉంటున్నారు.మరి ఏం జరిగిందో తెలియదు గాని, పెళ్లి అయిన ఇరవై రోజులకే  తన ఇంట్లోనే శృతి ఉరి వేసుకొని విగత జీవిగా కనిపించింది.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని శృతి మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని దర్యాప్తు ని మొదలుపెట్టారు.ఇక ఈ సంఘటన తర్వాత డ్రైవర్ గా పని చేస్తున్న భర్త దయాకర్ పరారీలో ఉన్నట్టుగా  తెలుస్తుంది.

ఇక శృతి మృతి పట్ల ఆమె తల్లి తండ్రులు మాట్లాడుతు మా అమ్మాయిని అత్తింటి వారే వర కట్న వేధింపులతో  చంపి ఆత్మహత్య గా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.శృతి సోదరి తో పాటు ఆమె సన్నిహితులు కూడా శృతి ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, శృతి మరణానికి కారణమైన వాళ్ళని శిక్షించాలని కోరుతున్నారు.ఎంతో భవిష్యత్తు ఉన్న గాయని మరణం తెలంగాణ జానపద రంగానికి తీరని లోటని పలువురు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here