తెలంగాణ పదో తరగతి విద్యార్ధుల పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ గురువారం (డిసెంబర్ 19) విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పబ్లిక్ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఏ తేదీన ఏ పరీక్ష ఉంటుందో ఆ వివరాలు మీ కోసం..

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి విద్యార్ధులకు పబ్లిక్‌ పరీక్షలు వచ్చే ఏడాది మార్చి 21వ తేదీ నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ జాబితాలోనే తెలంగాణ విద్యాశాఖ 10వ తరగతి వార్షిక పరీక్షల షెడ్యూల్ను కూడా విడుదల చేసింది.

పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ ఇదే:

2025 మార్చి 21న ఫస్ట్ లాంగ్వేజ్ ఎగ్జామ్

2025 మార్చి 22 న సెకెండ్ లాంగ్వేజ్

2025 మార్చి 24 న ఇంగ్లీష్ ఎగ్జామ్

2025 మార్చి 26 న మ్యాథ్స్

2025 మార్చి 28 న ఫిజికల్ సైన్స్

2025 మార్చి 29 న బయోలాజికల్ సైన్స్

2025 ఏప్రిల్ 2 న సోషల్ స్టడీస్

పదో తరగతి పరీక్షలు గతంలో మాదిరిగానే 80% మార్కులకు జరగనున్నాయి. వచ్చే ఏడాది 2025-26 నుంచి వార్షిక పరీక్షలు 100 మార్కులకు జరుగుతాయి. ఈ నిబంధనలో మార్చి 21 నుంచి ప్రారంభం అయ్యే మార్కులు 80% మార్కులకు జరగనుండగా 20% మార్కులు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ నుంచి కలపనున్నారు. అయితే ఈ ఏడాది పదో తరగతి పరీక్షా ఫలితాలు మార్కుల రూపంలో వెల్లడించనున్నారు. గతంలో గ్రేడింగ్ రూపంలో ఇస్తున్న ఫలితాలను ఎత్తివేస్తూ మార్కులను ప్రకటించనున్నట్లు ఇటీవల విద్యాశాఖ జీవో జారీ చేసింది. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి పరీక్షా విధానంలోనూ మార్పులను తీసుకురానున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here