తెలుగులో అప్పట్లో చాలామంది కమెడియన్లు మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి వారిలో లక్ష్మీపతి కూడా ఒకరు. కితకితలు సినిమాతో ఆయనకు మంచి పేరు వచ్చింది. బాబీ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఆయన.. దాదాపు 50కి పైగా సినిమాల్లో నటించారు. ఆయన తనయుడు హీరో అని మీకు తెల్సా
టాలీవుడ్‌లో ఎంతోమంది కమెడియన్స్ మంచి పేరు తెచ్చుకున్నారు. బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, కొంచెం యాసలో ఎటకారం.. ఇలా కమెడియన్లు తమదైన సొంత స్టైల్‌ను క్రియేట్ చేసుకున్నారు. అలాంటి వారిలో ఒకరు లక్ష్మీపతి. ఎంఎస్ నారాయణ, ఏవిఎస్, ధర్మవరపు, బ్రహ్మానందం.. ఇంతటి హేమాహేమీలు లాంటి కమెడియన్లు ఉన్నా.. తనదైన మాటకారితనంతో కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు లక్ష్మీపతి. సుమారు 50కిపైగా సినిమాల్లో నటించిన ఈ దివంగత నటుడు.. లేటు వయస్సులో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా తన మార్క్ వేశారు. 2000sలో సునీల్, లక్ష్మీపతి మధ్య కొన్ని కామెడీ సీన్స్ ఇప్పుడు చూసినా.. కడుపుబ్బా నవ్వుకుంటారు.
లక్ష్మీపతి తొలుత రచయితగా కెరీర్ ప్రారంభించారు. పలు చిత్రాలకు రచనా సహకారం అందించారు. ఇక చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ చిత్రంతో నటుడిగా మారారు. అలాగే ‘అల్లరి’ సినిమా లక్ష్మీపతికి మంచి పేరు తెచ్చిపెట్టింది. అటు సీనియర్ డైరెక్టర్ శోభన్ స్వయానా లక్ష్మీపతి తమ్ముడు. ‘బాబీ’, ‘వర్షం’ లాంటి సినిమాలను తీశారు శోభన్. 2008లో శోభన్ అనారోగ్య సమస్యలతో మృతిచెందగా.. ఆయన చనిపోయిన నెల రోజుల్లోనే కుంగుబాటుకు గురై లక్ష్మీపతి కూడా ప్రాణాలు వదిలారు.
ఇక శోభన్ కొడుకులు ఇద్దరూ టాలీవుడ్‌లో క్రేజీ హీరోలు. అమ్మాయిల ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఆయన పెద్ద కుమారుడు సంతోష్ శోభన్.. పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత ఏక్ మినీ కథ, అన్నీ మంచి శకునములే, మంచి రోజులు వచ్చాయి, శ్రీదేవి శోభన్ బాబు లాంటి హిట్ చిత్రాలు చేశాడు. ఇక అతడి తమ్ముడు సంగీత్ శోభన్ మ్యాడ్ సినిమాలో ఒక హీరోగా నటించగా.. ఇప్పుడు మ్యాడ్ 2తో మళ్లీ ప్రేక్షకులను పలకరించనున్నాడు.