ఫార్ములా -E కేసు రచ్చ అసెంబ్లీలో సాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా తెలంగాణ అసెంబ్లీలో రగడ జరిగింది. ఫార్ములా ఈ-రేస్‌ వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ బీఆర్‌ఎస్‌ ఆందోళనకు దిగడంతో అధికార-విపక్షాల మధ్య యుద్ధం జరిగింది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యే తమకు చెప్పు చూపించారని బీఆర్‌ఎస్‌.. స్పీకర్‌పై దాడి చేశారంటూ కాంగ్రెస్‌ ఆందోళనలకు దిగాయి.

ఉదయం రణరంగంగా మారింది తెలంగాణ అసెంబ్లీ. భూభారతి బిల్లుపై చర్చను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. వెల్‌లోకి దూసుకెళ్లి బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేలు నిరసన తెలిపారు. పోడియం దగ్గర హరీష్‌రావు తోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు హంగామా సృష్టించడంతో అసెంబ్లీ మార్షల్స్‌ అడ్డుకున్నారు. ఉదయం జరిగిన గొడవకు సంబంధించిన దృశ్యాలు బయటకు వచ్చాయి. బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్‌ సభ్యుల దూకుడు చర్యలపై సీఎం రేవంత్‌ రెడ్డి ఆరా తీశారు.

బీఆర్‌ఎస్‌ ఆందోళనతో తెలంగాణ అసెంబ్లీ రెండుసార్లు వాయిదా పడింది. సభ ప్రారంభం కావడంకావడమే ఆందోళనకు దిగింది బీఆర్‌ఎస్. ఫార్ములా ఈ-రేస్‌ అంశంపై మాట్లాడిన హరీష్‌రావు చర్చకు పట్టుబట్టారు. అయితే, గవర్నర్‌ అనుమతి ఇచ్చిన తర్వాతే కేసు పెట్టారంటూ కౌంటర్‌ ఇచ్చారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి. అయినా, బీఆర్‌ఎస్‌ ఆందోళన కొనసాగడంతో సభను వాయిదా వేశారు స్పీకర్‌.

సభ, తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా బీఆర్‌ఎస్‌ నిరసన కొనసాగింది. భూభారతి బిల్లుపై మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా స్పీకర్‌ పోడియం దగ్గరకు దూసుకెళ్లి ఆందోళన చేపట్టారు బీఆర్ఎస్‌ సభ్యులు. వెల్‌లోకి వెళ్లిన బీఆర్ఎస్ సభ్యులపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో పేపర్లు చించి స్పీకర్‌పైకి విసిరేశారు బీఆర్ఎస్ సభ్యులు. బీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల తీరుతో కాంగ్రెస్‌ సభ్యులు ఎదురుదాడికి దిగారు. పరస్పరం పేపర్లు విసురుకోవడంతో సభలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్షల్స్‌కి, బీఆర్ఎస్‌ సభ్యులకి మధ్య తోపులాట జరిగింది.

బీఆర్‌ఎస్‌ సభ్యుల తీరుపై మండిపడ్డారు స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌. భూభారతి బిల్లును అడ్డుకోవద్దని సూచించారు. స్పీకర్‌పై బీఆర్‌ఎస్ సభ్యులు దాడికి యత్నించారంటూ మండిపడ్డారు మంత్రి పొంగులేటి. సభలో గూండాగిరి, దాదాగిరి చేస్తామంటే కుదరంటూ వార్నింగ్‌ ఇచ్చారు. అసెంబ్లీ లోపలా బయట అధికార, విపక్షాల మధ్య హైవోల్టేజ్‌ డైలాగ్‌ వార్‌ నడిచింది. అయితే, బీఆర్‌ఎస్‌ సభ్యులు.. స్పీకర్‌ను కొట్టేంత పనిచేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీ బయటకు వచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here