నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. రంగంలోకి దిగిన షీ టీమ్ ఆకతాయిల పని పట్టింది. షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే వచ్చి ఆకతాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు.

హనుమకొండలో నిత్యం రద్దీగా ఉండే పబ్లిక్ గార్డెన్లో ఆకతాయిలు తిష్ట వేశారు. ఆడవాళ్ళు, అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తున్నారు. బాధితులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి షీ టీమ్ బృందం ఆ ఆవారాగాళ్ళను ఎలా పట్టుకున్నారో తెలుసా? వారికి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆ ఘటన ఏంటో మీరే చూడండి…

బాధితులు ఇచ్చిన సమాచారంతో షీటీమ్ బృందం రంగంలోకి దిగింది. హనుమకొండలోని పబ్లిక్ గార్డెన్లో రెక్కీ నిర్వహించి సాధారణ మహిళల్లాగే గడిపారు. సాయంత్రం సమయంలో ఎప్పటిలాగే అక్కడికి చేరుకున్న పోకిరీలు అమ్మాయిల పట్ల వేధింపులు పాల్పడ్డారు. అప్పటికే అక్కడ రెక్కీ నిర్వహిస్తున్న షి టీమ్స్ బృందం 20 మంది ఆకతాయిలను పట్టుకున్నారు. వారిలో ఉన్నత చదువులు చదువుకునే పేద విద్యార్టులు కూడా ఉన్నారు. వారిని పట్టుకొని తమదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారు.

మొదటి తప్పుగా వారికి కౌన్సిలింగ్ నిర్వహించి వదిలేశారు. మహిళల రక్షణ కొరకు షీ టీం బృందం పనిచేస్తుందని ఎలాంటి సమయాల్లో అయినా మహిళలపై అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షీ టీమ్స్ ఇన్స్పెక్టర్ సుజాతా తెలిపారు. ఎవరైనా వాట్సాప్, ఇన్‌స్ట్రాగ్రామ్, ఫేసుబుక్, సామజిక మధ్యమాలలో మహిళలను వేధిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here