ఈ అమ్మడు తెలుగులో చేసింది కేవలం మూడు సినిమాలే. అటు బెంగాలీ భాషలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయినప్పటికీ ఏ చిత్రమూ అమ్మడికి మంచి ఫేం తెచ్చిపెట్టలేదు. కానీ 2020లో విడుదలైన ‘ఆశ్రమ్’ అనే బోల్డ్ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సంచలనం అయింది.

కరోనా టైంలో విడుదలైన ‘ఆశ్రమ్’ బోల్డ్ వెబ్‌సిరీస్.. అప్పట్లో ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దీనితో ఈ సిరీస్‌కి కొనసాగింపుగా ఇప్పటికే మరో రెండు సీజన్లు సైతం విడుదలయ్యాయి. బాబీ డియాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌లో బబిత పాత్రలో కనిపించింది త్రిధా చౌదరి. ఈ వెబ్ సిరీస్‌లో అమ్మడు బాబీ డియోల్‌తో రొమాంటిక్ సన్నివేశాల్లో రచ్చలేపింది. దీని కంటే ముందు తెలుగు, హిందీలో పలు సినిమాల్లో నటించింది త్రిధా చౌదరి. కానీ ఆమెకు ఈ బోల్డ్ వెబ్ సిరీస్.. మంచి పేరు తెచ్చిపెట్టింది.

త్రిధా చౌదరి తన కెరీర్‌ని ‘దహ్లీజ్’ అనే టీవీ షో ద్వారా ప్రారంభించింది. ఆ తర్వాత బెంగాలీ, తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలలో నటించింది. సూర్య వర్సస్ సూర్య, అనుకున్నది ఒకటి అయ్యిందోకటి, మనసుకు నచ్చింది లాంటి సినిమాలను తెలుగులో చేసింది ఈ అమ్మడు. ఇక త్రిధా చౌదరి ‘బందిష్ బందిపోటు’, ‘ఆశ్రమ్’ లాంటి సూపర్ హిట్ వెబ్‌సిరీస్‌లు చేసింది. ఈ భామకు ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్.. ‘ఆశ్రమ్’ వెబ్ సిరీస్‌తో దేశవ్యాప్తంగా పాపులర్ అయింది. ముఖ్యంగా ఆ సిరీస్‌లో బాబీ డియోల్‌తో చేసిన ఇంటిమేట్ సీన్స్ అప్పట్లో సంచలనం సృష్టించాయి. ఇక ఈ పాపులర్ వెబ్ సిరీస్ ‘ఆశ్రమ్’కు త్వరలోనే నాల్గవ సీజన్ రాబోతుంది.

మరోవైపు నవంబర్‌లో త్రిధా చౌదరి తీసిన ‘లవ్ గ్యారేజ్’ అనే షార్ట్ ఫిల్మ్ విడుదలైంది. ఈ షార్ట్ ఫిల్మ్‌కు దర్శకుడు ఆశిష్ పాండా. అలాగే త్రిధా ఎప్పుడూ ఏదొక ప్లేస్‌కి ట్రావెల్ చేస్తూనే ఉంటుంది. ఎప్పటికప్పుడు తన వెకేషన్ చిత్రాలను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అలాగే అప్పుడప్పుడూ బికీనీల్లో పోజులిస్తూ కుర్రకారుకు సెగలు పుట్టిస్తోంది. లేట్ ఎందుకు ఆ ఫోటోలపై మీరూ ఓ లుక్కేయండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here