వర్సటైల్ నటుడిగా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తున్నారు. విజయ్ సేతుపతికి తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలు తెలుగులోనూ మంచి విజయాలను అందుకుంటున్నాయి.. మహారాజ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ సేతుపతి. తాజాగా విడుదల 2 సినిమాతో ప్రీక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా సూపర్ హిట్ గా నిలిచింది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో చాలా సినిమాలు వేల కోట్ల కలెక్షన్లు రాబట్టాయి. ఇటీవల విడుదలైన ‘పుష్ప 2’ చిత్రం కేవలం కేవలం ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసింది. నిజానికి కోవిడ్ తర్వాత సినిమాల వసూళ్లు పెరిగాయి. సినిమా టిక్కెట్ల ధరలు కూడా పెరిగాయి. అయితే ఇండియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాల జాబితాలో ‘దంగల్’ మొదటి స్థానంలో ఉండగా, ‘బాహుబలి 2’ తర్వాతి స్థానంలో ఉంది. ఈ సినిమాలు విడుదలై ఏళ్లు గడుస్తున్నా ఈ సినిమా రికార్డును మరే సినిమా బ్రేక్ చేయలేకపోయింది. అయితే ఇప్పుడు అతి చిన్న బడ్జెట్ సినిమా ‘బాహుబలి’ సినిమా రికార్డును బ్రేక్ చేసింది. ఆ సినిమా ఎదో కాదు విజయ్ సేతుపతి నటించిన మహారాజా. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన తమిళ చిత్రం ‘మహారాజా’ ఇప్పుడు ‘బాహుబలి’ సినిమా రికార్డును బద్దలు కొట్టింది.
‘బాహుబలి 2’ సినిమా టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్ రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేయలేదు. దానికి బదులు విదేశాల్లో ముఖ్యంగా ఒక దేశంలో సినిమా కలెక్షన్లను ‘బాహుబలి 2’ అధిగమించింది.ఈ ఏడాది జూన్‌లో ‘మహారాజా’ సినిమా థియేటర్లలో విడుదలైంది. అద్భుతమైన కథ, కథనం, నటనతో సినిమా ఆకట్టుకుంది. ఈ సినిమా ఇండియాలో ఇప్పటికే 180 కోట్లకు పైగా వసూలు చేసింది. కొద్ది రోజుల క్రితం చైనాలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా అద్భుతంగా వసూళ్లు రాబడుతోంది. చైనాలోని ప్రేక్షకులు ‘మహారాజా’ సినిమాను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా చైనాలో హౌస్ ఫుల్ షోస్ దూసుకుపోతుంది.
‘మహారాజా’ కొద్ది రోజుల్లోనే చైనా బాక్సాఫీస్‌లో 76.50 కోట్ల రూపాయలు వసూలు చేసింది. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి 2 చైనా మార్కెట్‌లో రూ.64 కోట్లు రాబట్టింది. ఇప్పుడు ‘బాహుబలి 2’ రికార్డును బద్దలు కొట్టిన ‘మహారాజా’ చైనా బాక్సాఫీస్ వద్ద 100 కోట్ల వసూళ్లను రాబట్టడం విశేషం. అంతే కాదు ‘దంగల్’ సినిమా రికార్డును కూడా బద్దలు కొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. విజయ్ సేతుపతి ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్‌గా నటించారు. ఈ చిత్రానికి నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. కేవలం 20 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే 250 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.