ఆమెకు దహీపూరి చాట్ అంటే ఇష్టం. సరే.! బయటకు వెళ్లి తినేందుకు ఊపిక లేక.. ఆన్‌లైన్ ఫుడ్ యాప్ ద్వారా ఆర్డర్ పెట్టింది. కాసేపటికి ఆ పార్శిల్ ఇంటికొచ్చింది. తీరా ఆవురావురుమని అది ఓపెన్ చేసి చూడగా.. దెబ్బకు షాక్ అయ్యింది సదరు యువతి.
పండ్ల నుంచి కూరగాయల వరకు.. బట్టల నుంచి ఫుడ్ పార్శిళ్ల వరకు అన్ని ఇంటి నుంచే ఆన్‌లైన్‌లోనే ఆర్డర్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బెంగళూరుకు చెందిన ఓ యువతి ఉత్సాహంగా ఓ ఆన్‌లైన్ ఫుడ్ యాప్‌లో దహీపూరి చాట్ ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు దహీపూరికి బదులుగా ఇంటికొచ్చిన పార్శిల్ చూసి దెబ్బకు షాక్ అయింది. దీంతో విసుగు చెందిన సదరు యువతి.. బెంగుళూరు వదిలి వెళ్లడానికి 101 కారణాల్లో ఇది కూడా ఒకటని సోషల్ మీడియాలో తన అసంతృప్తిని వ్యక్తం చేసింది.
దహీపూరి చాట్ చాలామందికి ఇష్టమైన ఈవెనింగ్ స్నాక్. అందుకే చాలామంది తరచుగా రోడ్డు పక్కన దహీపూరి తింటుంటారు. అదే విధంగా బెంగళూరులో నివాసం ఉంటున్న ఓ నార్త్ ఇండియన్ యువతి కూడా దహీపూరి తినాలనుకుంది. దానికి తగ్గట్టుగా ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టింది. తీరా ఇంటికొచ్చిన పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.. దహీపూరికి బదులుగా.. మాములు పూరి పార్శిల్, పెరుగు గిన్నె వచ్చాయి. ఇది చూసి ఆమె బిత్తరపోయింది. తన అసంతృప్తిని సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ ట్వీట్ చేసి.. “బెంగుళూరును విడిచిపెట్టడానికి 101 కారణాలు.. అందులో ఇది ఒకటి” అని క్యాప్షన్‌లో రాసుకొచ్చింది. ఇక ఆ పోస్ట్ ఇంటర్నెట్‌లో తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.