పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. దీని ప్రభావం కారణంగా సోమవారం నుంచి గురువారం వరకు ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా రాష్ట్రాల్లో అనేక చోట్ల తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది
ప్రస్తుతం పశ్చిమ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని, దీని ప్రభావం కారణంగా ఏపీలోని తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అంచనా వేసింది.
ఈ తీవ్ర అల్పపీడనం ప్రస్తుతం పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని, మంగళవారం నాటికి ఏపీలోని దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వైపు చేరుకుంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో బుధవారం వరకు సముద్రంలో గంటకు గరిష్ఠంగా 55 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
.