సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి మరణం విషయంలో బెయిల్ పై ఉన్న అల్లుఅర్జున్(allu arjun)ని హైకోర్టు ఆదేశాల ప్రకారం పోలీసులు విచారించి పంపించేసారు.ఇక విచారణలో పోలీసులు పలు విషయాలపై అల్లు అర్జున్ నుంచి సమాధానాలు రాబట్టారు.కొన్నిటికి మాత్రం అల్లుఅర్జున్ ఎటువంటి సమాధానాలు చెప్పకుండా మౌనంగా ఉండిపోయినట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ కేసులో మొత్తం పద్దెనిమిది మందిని పోలీసులు నిందితులుగా చేర్చగా తొక్కిసలాటకి కారణం A 12 నుంచి A 15 వరకు చేర్చడం జరిగింది. A 1 గా ఆగమాటి పెదరామిరెడ్డి, A 2 గా అగమాటి చిన్న రామిరెడ్డి, A 3 సందీప్, A 4 సుమిత్, A 5 అగమాటి వినయ్, A 6 అశుతోష్ రెడ్డి, A 7 రేణుకా దేవి, A 8 అరుణా రెడ్డి వీళ్ళందరూ థియేటర్ ఓనర్స్ అండ్ పార్ట్నర్స్ కాగా A 9 గా నాగరాజు (మేనేజర్) A 10 విజయ్ చందర్ లోయర్ బాల్కనీ ఇంచార్జ్, A 11 గా అల్లు అర్జున్,A 12 సంతోష్(అల్లు అర్జున్ పి ఏ)
A 13 శరత్ బన్నీ(అల్లు అర్జున్ మేనేజర్) A 14 రమేష్, A 15 రాజు(సెక్యూరిటీ టీం) A 16 వినయ్ కుమార్ (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) A 17 ఫర్వేజ్(బాడి గార్డ్) A 18 మైత్రి మూవీ ప్రొడ్యూసర్స్. ఈ పేర్లన్నింటిని అల్లు అర్జున్ కి పోలీసులు చూపించడం జరిగింది.