బిగ్ బాస్ 8 విష్ణుప్రియ అండ్ పృద్వి ఎపిసోడ్స్ మంచి క్యూట్ గా ఉంటాయి. అలాంటి విష్ణుప్రియకు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు వియర్డ్ కలలు వచ్చేవట. ఆ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “ఒక రోజు మా నాన్న, ఒక రోజు మా తమ్ముడు చనిపోయినట్టు, ఒక రోజు మా చెల్లిని కిడ్నప్ చేసినట్టు, ఒక రోజు అల్లు అర్జున్, రవితేజగారు నా డ్రీమ్ లోకి వచ్చి రా పార్టీ చేసుకుందాం అన్నట్టు రకరకాల కలలు వచ్చాయి. మూడు నెలల పాటు నాకు సరిగా నిద్ర లేదు. ఒక ఉద్యమంలా బతికాను నిద్రలేక. ఒకవేళ బిగ్ బాస్ హౌస్ నుంచి ఏదైనా దొబ్బేయాల్సి వస్తే కొన్ని పింక్ చెయిర్స్ తీసుకుపోయి నా బాల్కనీలో వేసుకుంటా.
ఒక వేళా బిగ్ బాస్ టైం మెషిన్ ఇస్తే గనక దివాలి రోజుకు వెళ్లి ఎంజాయ్ చేయాలనీ ఉంది. ఎందుకంటే ఆ రోజు పృద్వితో టైం స్పెండ్ చేసి డాన్స్ చేసి స్వీట్స్ తిన్నాం. ఇక ఒక్కొక్కరి గురించి చెప్పాలి అనే నిఖిల్ లో కెప్టెన్సీ స్కిల్స్ ఉన్నాయి. నబీల్ డెడికేటెడ్ స్టూడెంట్, ప్రేరణ స్మార్ట్ అండ్ ఇంటెలిజెంట్, గౌతమ్ చూడడానికి ఓకే కానీ డేంజరస్, రోహిణి ఫైర్, అవినాష్ డేంజరస్ కానీ నైస్ కమెడియన్, సోనియా గురించి ఎక్కువ తెలీదు. మణికంఠ డ్రామా కింగ్. శేఖర్ బాషా హానెస్ట్ గా ఉంటాడు. యాష్మి వారియర్, ఆదిత్య స్పిరిట్యుయల్ పర్సన్. సీత ఇంటెలిజెంట్. పృద్వి ఫైర్ విత్ ఫ్లవర్ హార్ట్. ఇప్పటి వరకు చేసిన షోస్ కంటే కూడా బిగ్ బాస్ హౌస్ నాకు ఎంతో మంది ప్రేమ దొరికింది. బిగ్ బాస్ 3 నుంచి అవకాశం వస్తూనే ఉంది. కానీ ఇప్పడు మా గురువు గారు జెడి. చక్రవర్తి చెప్పారని బిగ్ బాస్ 8 కి వెళ్లాను.” అని చెప్పింది విష్ణుప్రియ.