అత్యంత ఖరీదైన లంబోర్గిని కారు నడి రోడ్డుపై తగలబడిపోయింది. ముంబై మహానగరంలోని కోస్టల్ రోడ్డులో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో వేగంగా దూసుకెళుతున్న కారు నుంచి ముందు పొగలు రాగా, ఆ తర్వాత మంటలు చెలరేగి కారు తగలబడిపోయింది.

అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు. వెంటనే ఒక ఫైరింజ‌న్‌ సంఘటనా స్థలానికి పంపినట్లు అగ్నిమాపక శాఖ అధికారి ఒకరు తెలిపారు. దాదాపు 45 నిమిషాల్లో మంటలను ఆర్పివేసినట్లు పేర్కొన్నారు. ఇక ప్రమాద సమయంలో కారులో ఉన్న వారి వివరాలు, ఈ అగ్నిప్రమాదానికి గల కారణాలపై ఖచ్చితమైన సమాచారం లేదన్నారు.
కాగా, ఈ ఘటన తాలూకు వీడియోను వ్యాపార దిగ్గజం, రేమండ్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్నారు. ఇలాంటి సంఘటనలు లంబోర్గినీపై విశ్వసనీయత, భద్రతా ప్రమాణాల గురించి తీవ్రమైన ఆందోళనలను రేకెత్తిస్తాయని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here