తెలంగాణా రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఇద్దరు అనుమానాస్పదంగా మృతి చెందారు. వీరిలో ఒకరు మహిళా కానిస్టేబుల్ కాగా, మరొకరు కంప్యూటర్ ఆపరేటర్. ఈ ఇద్దరి శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం చేరవేశారు.
మహిళా కానిస్టేబుల్ శృతి మృతదేహంతో పాటు కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మృతదేహాలు చెరువులో కనిపించాయి. ఈ రెండు మృతదేహాలను గజ ఈతగాళ్లు వెలికి తీస్తున్నారు. చెరువు కట్ట వద్ద భిక్కనూరు ఎస్ఐ సాయికుమార్ వ్యక్తిగత కారు కనిపించడం ఇపుడు పలు అనుమానాలకు తావిస్తుంది.
అలాగే, ఘటనాస్థలంలో శృతి, నిఖిల్ మొబైల్ ఫోన్లు కనిపించాయి. ఘటనా స్థలానికి సాయికుమార్ కూడా కారులో వచ్చారని అనుమానం.. ఆయన అదృశ్శ్యంపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తంమీద మహిళా కానిస్టేబుల్ శృతి, కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ మిస్టరీ మరణాలు ఇపుడు అనుమానాస్పదంగా మారాయి.