నాలుగురోజులనాడు మెగాస్టార్ చిరంజీవి ఫొటో షూట్ జరిగిన ఫొటోలు మీడియాకు విడుదలచేశారు. అప్పటినుంచి మెగాస్టార్ చిరంజీవి కొత్త చిత్రం కోసమని తెగ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చిరంజీవి కలుస్తారని అనుకున్నారు. కానీ ఆ ముందురోజే మెగాస్టార్ చిరంజీవి ముంబై వెళ్ళారు. అందుకే ఆయన రాలేకపోయారని ఆయన పి.ఆర్. తెలియజేసింది. ఇక ముంబైలో యాడ్ షూటా? లేదా సినిమా కోసం వెళ్ళారా? అన్నది క్లారిటీ లేకపోయినా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సినిమా కోసమే అని సోషల్ మీడియాలో వార్తలు వచ్చేశాయి.
అందుకే దానికి ఫుల్ స్టాప్ పెట్టాలని చిరుతో సినిమా చేయబోతున్న ఎస్‌ఎల్‌వి సినిమాస్‌కు చెందిన సుధాకర్ చెరుకూరి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ సినిమా హీరో నాని బేనర్ తో కలిసి చేయబోతున్నారు. అయితే చిరు సినిమా ఇప్పుడే కాదు. శ్రీకాంత్ ఓదెల నానితో మరో చిత్రం ‘ది ప్యారడైజ్’లో పనిచేస్తున్నారు. అది అయిన తర్వాతే చిరు సినిమా వుంటుందంటూ పేర్కొన్నారు.
మరో విషయం ఏమంటే, ఈ సినిమాలో హీరోయిన్ వుండదు. అని కూడా సోషల్ మీడియాలో న్యూస్ వస్తున్నాయి. దానికి నిర్మాత చెబుతూ, ”మెగా156 పీరియాడికల్ ఫిల్మ్. సోషల్ మీడియాలో జరుగుతున్న దాంట్లో నిజం లేదు. మేము కెమెరామెన్, సంగీత దర్శకుడిని లాక్ చేసాము. ప్రస్తుతం కథ డెవలప్ స్టేజ్‌లో ఉంది” అన్నారు. కాగా, సమాచారం మేరకు చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర చేస్తున్న విషయం తెలిసిందే. అది కూడా ముగిసింది. ఇక దర్శకుడు అనిల్ రావిపూడి తో సినిమా చేయడానికి కమిట్ అయ్యాడు. ఆ సినిమా తర్వాతే శ్రీకాంత్ ఓదెల సినిమా వుంటుందని తెలుస్తోంది.