డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మన్యం పర్యటనలో భద్రతా లోపం ఏర్పడింది. పవన్ మన్యం పర్యటన సందర్భంగా ఓ నకిలీ ఐపీఎస్ కలకలం రేపాడు. వై కేటగిరీ భద్రతలో ఉండే పవన్ చుట్టూ బలివాడ సూర్యప్రకాశ్ రావు అనే నకిలీ ఐపీఎస్ తిరిగాడు.
డిప్యూటీ సీఎం పర్యటనలో భద్రతా వైఫల్యం కలకలం రేపింది. దీనిపై హోం మంత్రి అనిత ఫైర్ అయ్యారు. విచారణకు ఆదేశించారు. భద్రతా లోపంపై సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
పవన్ పర్యటన నేపథ్యంలో మావోయిస్టుల ప్రభావం ఉండే మన్యం ప్రాంతంలో పోలీసులు గట్టి భద్రతే ఏర్పాటు చేశారు. అయితే పోలీసు యూనిఫామ్ లో ఐపీఎస్‌గా వచ్చిన సూర్యప్రకాష్ అనే వ్యక్తి పవన్ టూర్ లోకి చొరబడి హల్ చల్ చేసినట్లు తెలుస్తోంది. వన్ టూర్ ముగిశాక అతను విజయనగరం నుంచి హైదరాబాద్ వెళ్తుండగా విజయనగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here