మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో మన్మోహన్ పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. పార్థీవ దేహానికి రేవంత్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. రేవంత్ రెడ్డి వెంట డిప్యూటి సిఎం మల్లు భట్టి విక్రమార్క ఉన్నారు. డిల్లీ నుంచి రేవంత్ రెడ్డి హైద్రాబాద్ కు తిరుగుపయనమయ్యారు.