సంధ్యా థియోటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టులో ఊరట లభించలేదు. ఆయన రెగ్యులర్ బెయిలు కోరుతూ దాఖలు చేసుకున్న పిటిషన్ పై తీర్పును కోర్టు వచ్చే నెల 3కు వాయిదా వేసింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.
అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిలు ఇవ్వవద్దంటూ పోలీసులు కౌంటర్ దాఖలు చేయడంతో ఇరు పక్షాల వాదనలూ విన్న నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ బెయిలు పిటిషన్ పై విచారణను వచ్చే నెల 3కు వాయిదా వేసింది. ప్రస్తుతం అల్లు అర్జున్ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిలుపై బయట ఉన్న సంగతి తెలిసిందే.