మరో ప్రయోగానికి ఇస్రో సిద్దమైంది. పీఎస్ ఎల్ వి సి 60స్పాడెక్స్ మిషన్ రాకెట్ ద్వారా మరికొద్ది గంటల్లో నింగిలోకి రెండు ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడానికి ఇస్రో సిద్దమైంది. సాంకేతికత అభివృద్దే లక్ష్యంగా ఈ ప్రయోగం చేపట్టినట్టు తెలుస్తోంది. ఆదివారం రాత్రి 8. 58 గంటలకు కౌంట్ డౌన్ ప్రారంభం అయింది. 25 గంటల పాటు కౌంట్ డౌన్ కొనసాగనుంది. సోమవారం రాత్రి 9. 58 గంటలకు శ్రీహరికోటలోని స్పేస్ సెంటర్ నుంచి రెండు ఉపగ్రహాలను ప్రవేశ పెట్టనున్నారు. వీటిని దిగువ కక్ష్యలో అనుసంధానం చేయనున్నారు. ఖగోళ ప్రయోగాల్లో అద్బుత విజయాలను మూట గట్టుకున్న ఇస్రో ఈ ప్రయోగం విజయం సాధించనుందని ఆశిద్దాం.