రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రం ప్రమోషన్స్ మొదలయ్యాయి. ఇటీవలే డల్లాస్ లో ఈవెంట్ చేశారు. ప్రస్తుతం విజయవాడలో భారీగా ఫంక్షన్ చేయాలనీ కర్టెన్ రైజర్ గా రామ్ చరణ్ భారీ కటౌట్ ను విజయవాడలో ఆవిష్కరించారు. 256 అడుగుల ఎత్తైన ఈ కటౌట్ లాంచ్ ఈవెంట్‌కు దిల్ రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి ఈవిధంగా అభిమానులనుద్దేశించి మాట్లాడారు.
ఇక్కడ రామ్ చరణ్ భారీ కటౌట్‌ను రివీల్ చేయడం ఆనందంగా ఉంది. చిరంజీవి గారి మీద 40, 50 ఏళ్ల నుంచి మీ అభిమానం అలానే ఉంటోంది. చిరంజీవి నుంచి మనకు పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, బన్నీ, సాయి ధరమ్ తేజ్ ఇలా చాలా మందిని అందించారు. ఇలా అందరికీ మెగా ఫ్యాన్ సపోర్ట్ ఉంటూనే వస్తోంది.
2 గంటల 45 నిమిషాలు మాత్రమే ఉండాలని నిడివి విషయంలోనూ శంకర్ గారితో మాట్లాడాను. అంతే నిడివిలో శంకర్ గారు అద్భుతంగా కట్ చేసి ఇచ్చారు.జనవరి 1న ట్రైలర్ రానుంది. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే డేట్‌ను బట్టి జనవరి 4 లేదా 5 ఏపీలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. జనవరి 10న సినిమా రాబోతోంది. ఈ సంక్రాంతిని గట్టిగా సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీగా ఉండండి’ అని అన్నారు.