తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ అయిన కామారెడ్డి జిల్లాలో ట్రయాంగిల్ సుసైడ్ కేసులో మరో ట్విస్ట్ చేటుసుకుంది. వీరు ఆత్మ హత్య చేసుకోవడానికి 15 రోజుల ముందు జిల్లా ఎస్ పి సింధు శర్మ ఎదుట పెద్ద పంచాయతీ జరిగినట్లు తెలుస్తోంది. కంప్యూటర్ ఆపరేటర్ నిఖిల్ , శృతి పెళ్లి చేసుకోవాలని ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నారు. కానీ ఎస్ ఐ సాయికుమార్ అడ్డుపడ్డాడు.
ఎస్ఐ సాయికుమార్ తో శృతి అక్రమ సంబంధం కొనసాగించినట్లు ఆధారాలు కూడా పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. తన భర్త అక్రమ సంబంధంపై ఎస్ ఐ భార్య మహలక్ష్మి ప్రతీరోజు గొడవపడేది. కానిస్టేబుల్ తో ఉన్న అక్రమ సంబంధాన్ని భర్తను నిలదీసేది మహలక్ష్మి. నేను విడాకులు ఇవ్చవకుండా నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని పలుమార్లు హెచ్చరించింది మహలక్ష్మి. చట్టబద్దంగా ఈ పెళ్లి చెల్లదు అయినా తనను పెళ్లి చేసుకోవాలని శృతి సాయికుమార్ పై వత్తి డి తెచ్చింది. ఈ గొడవ చిలికి చిలికి గాలివానగా మారి మూడేళ్ల కొడుకుతో మహలక్ష్మి పుట్టింటికి వెళ్లిపోయింది. ప్రస్తుతం మహలక్ష్మి గర్బవతి.
భార్య పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపం చెందిన ఎస్ ఐ సాయికుమార్ నిఖిల్, శృతితో గొడవపడ్డాడు. ఎస్ ఐ కంటే ముందే శృతికి నిఖిల్ తో ప్రేమ వ్యవహారం ఉంది. పెళ్లి చేసుకోవాలనే సమయంలో ఎస్ఐ సాయికుమార్ విలన్ గా మారాడు. నాతో రిలేషన్ లో ఉన్నప్పుడు నిఖిల్ ను ఎలా పెళ్లి చేసుకుంటావని శృతిని నిలదీశాడు. ఎస్ ఐ ని పెళ్లి చేసుకోవడానికి శృతికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే సాయికుమార్ భార్య ఒప్పుకోకపోవడంతో వీరి ఫిజికల్ రిలేషన్ కు ఎండ్ కార్డ్ పడలేదు. దీంతో శృతి పెళ్లికాని నిఖిల్ ను పెళ్లి చేసుకోవాలనుకుంది. శృతికి పెళ్లయి విడాకులు కూడా తీసుకుంది. బీబీ పేటలో ఒంటరిగా ఉంటోంది.
ఎస్ ఐ సాయికుమార్ టార్చర్ ఎక్కువ కావడంతో నిఖిల్ ఎస్పిని ఆశ్రయించాడు. సాయికుమార్ తరపున ఒక సిఐ , ఎస్ఐ మధ్యవర్తిగా ఉంటూ సమస్యను పరిష్కారం చేయాలనుకున్నారు.
కానీ ఎస్ఐ స్వయంగా రంగంలో దిగాడు. శృతి, నిఖిల్ ను పెద్ద చెరువు వద్దకు రమ్మన్నాడు. అర్దరాత్రి సమయంలో ముగ్గురి మధ్యమాటామాటా పెరగడంతో శృతి చెరువులో దూకేసింది. శృతిని రక్షించడానికి నిఖిల్ , వీరిద్దరిని రక్షించడానికి సాయికుమర్ నీళ్లలో దూకాడు ఈత రాకపోవడంతో ముగ్గురు చనిపోయారు. పోలీసు శాఖ పరువు పోతుందన్న భయంతో ఉన్నతాధికారులు ఈ కేసు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. . చట్టాన్ని రక్షించాల్సిన శాఖలో పని చేస్తున్న ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం డిపార్ట్ మెంట్ కే కళంకం తెచ్చింది.