సంక్రాంతి సంబరాలు అంటే ఆ మజానే వేరు మచ్చా. ఎందుకంటే కోడి పందేలు, పేకాట, పట్టు చీరలు, ముగ్గులు, ఎడ్ల పందాలు…ఇవే ఈ పండక్కి బ్రాండ్ థింగ్స్. ఐతే బుల్లితెర మీద సంక్రాంతి అంటే అబ్బో ఆ రేంజ్ వేరు..ఐతే ఈ సంక్రాంతికి మరి ప్రతీ ఇంటికి అల్లుడు రాబోతున్నాడు. అదేనండి సుడిగాలి సుధీర్. “ఈ సంక్రాంతికి వస్తున్నాం” అంటూ ఒక షో త్వరలో సంక్రాంతి సందర్భంగా రాబోతోంది. దానికి సుధీర్ హోస్ట్ గా వస్తున్నాడు. “ఎక్కడైనా అల్లుడొచ్చాక పండగ జరుగుద్ది. కానీ ఇక్కడ మాత్రం పండగ చేయడానికి అల్లుడొచ్చాడు” అంటూ స్టైలిష్ సుధీర్ డైలాగ్ చెప్పాడు. ఇక స్మాల్, బిగ్ స్క్రీన్స్ లో కనిపించే వాళ్లంతా ఈ షోకి వచ్చారు. ఇక మళ్ళీ సుధీర్ – రష్మీ లవ్ ట్రాక్ స్టార్ట్ అయ్యింది. ఇద్దరూ కలిసి ఒక రొమాంటిక్ సాంగ్ కి మెస్మోరైజింగ్ పెర్ఫార్మెన్స్ చేసారు. ఇక రష్మీ కాలికి పట్టీ తొడిగాడు సుధీర్. ఇక నెటిజన్స్ ఐతే ఫుల్ ఖుష్ లో ఉన్నారు.

ఎస్-ఆర్ జోడి కం బ్యాక్ ఇచ్చారు, సుధీర్ – రష్మీకి పెళ్లి చేసేయండి, ఈ సంక్రాంతికి ఈవెంట్ బ్లాక్ బస్టర్, ఎన్నాళ్లకు కనులకు విందు, వీళ్ళ జోడి ఎవర్ గ్రీన్. టిఆర్పి ఎక్కడికో వెళ్ళిపోద్ది..ఈటీవీకి అందం వచ్చింది. సుధీర్ ఉంటేనే ఆడియన్స్ హాయిగా నవ్వుకుంటారు ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఏదేమైనా రష్మీ, సుధీర్ జోడి ఏపీకీ బుల్లితెర మీద ఎవర్ గ్రీన్ జోడి అని చెప్పొచ్చు. ఇక హైపర్ ఆది ఐతే అల్లు అర్జున్ ని ఇమిటేట్ చేసి బుల్లితెర పుష్ప అనిపించుకున్నాడు. “ఈ సంక్రాంతికి ఎవ్వరైనా గాని అస్సలు తగ్గేదెలా” అంటూ చెప్పుకొచ్చాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here