ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ప్రస్తుతం సీఎస్‌గా ఉన్న నీరభ్ కుమార్ పదవీకాలం సోమవారంతో ముగియనుంది. దీంతో ఆయన స్థానంలో కొత్తగా నీరభ్ కుమార్ ఎంపికయ్యారు. కొత్త సీఎస్ విజయానంద్ బుధవారం మధ్యాహ్నం పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ ప్రస్తుతం ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఈయన వచ్చే యేడాది నవంబరు నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. కాగా, విజయానంద్ ఇంతకుముందు 2022లో ఏపీ జెన్‌కో చైర్మన్‌గా, 2023లో ఏపీ ట్రాన్స్‌కోకు సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చేలా ప్రణాళిక : సీఎం చంద్రబాబు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని తన నివాసంలో నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చి రాష్ట్రాన్ని 100 శాతం కరువు రహిత రాష్ట్రంగా మార్చేందుకు అనుగుణంగా భారీ ప్రణాళికలను అమలు చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఒకవైపు పోలవరం పూర్తి చేయడం ద్వారా 8 ఉమ్మడి జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు.
పోలవరంతో ఉత్తరాంధ్రలోని మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు కూడా లబ్ధి చేకూరుతుందని చంద్రబాబు తెలిపారు. గోదావరి నదిలో వరదల సమయంలో సరాసరి ఏటా 2 నుంచి 3 వేల టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలుస్తోందని, ఈ నీటి నుంచి 280 టీఎంసీలను వరదల సమయంలో తీసుకోవడం ద్వారా… కృష్ణా డెల్టాకు, రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలు సహా ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు లబ్ది చేకూర్చేందుకు కార్యచరణ తీసుకువస్తున్నట్టు వివరించారు.