జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది. జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది. అయితే ఆఫీసులో ఒత్తిడి, చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి. వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి, చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు, ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది.
ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు, పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు. ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత, వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.
ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం, వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు.
ఆఫీసులో చిరాకు, ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం, ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం. దీని వల్ల ఉద్యోగులు పని చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు. ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది.
ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు, ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీని వల్ల పని చేసే వాతావరణం అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు, నిరాశ, ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే.. అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం, రక్తపోటు సమస్యలు, మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది.
చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి. అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.