కొన్ని సినిమాలు భారీ తారాగణం, భారీ బడ్జెట్ లతో వచ్చి హిట్ కొడుతుంటాయి. అయితే వాటి మధ్యలో కూడా కంటెంట్ బాగుండి కాస్త భిన్నమైన స్క్రీన్ ప్లే ఇంకా యునిక్ స్టైల్ అండ్ సహజత్వానికి దగ్గరగా ఉండే కథలని కొంతమంది ఇష్టపడుతుంటారు. అలాంటి కథా పాయింట్ తో వచ్చిన సినిమాలని థియేటర్లలో మిస్ అయిన వారు ఓటీటీలో తప్పకుండా చూసేయండి.

ఆల్ వి ఇమేజిన్ ఆజ్ లైట్(All we imagine as light).. పనికోసం ఓ ముగ్గురు మహిళలు ముంబాయికి వలస వస్తారు. వారికి లైఫ్ లో ఎదురైన సవాళ్ళేంటి? ఎలా ఎదుర్కున్నారనేది కథ. ఢిఫరెంట్ స్క్రీన్ ప్లే అండ్ సహజత్వానికి దగ్గరగా ఉండే స్టోరీ లైన్.. ‘పొయెటిక్ వే’ లో కథ సాగుతూ ఉంటుంది. భిన్నమైన కథలని ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చుతుంది. ఇది జనవరి 3 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో మిస్ అవ్వకండి.

 

మెర్రీ క్రిస్మస్ (Meeru Christmas) విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రలుగా చేసిన ఈ సినిమా కథ కాస్త స్లోగా సాగినా మంచి ఫీల్ గుడ్ మూవీ. ఇద్దరు అపరిచితుల మధ్య ఒక రాత్రి జరిగిన కథ.. అనుకోకుండా పరిచయం.. అందులోనే ఓ మర్డర్ మిస్టరీ దానిని కవర్ చేయడానికి హీరో, హీరోయిన్ పడే పాట్లు.. క్లైమాక్స్ లో ఇద్దరి మైండ్ సెట్ లు చూపించే విధానం కంప్లీట్ గా స్లో పేజ్డ్ ‘పొయెటిక్ వే’ లో సాగుతుంది. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

అమర్ సింగ్ చంకీల(Amar singh chamkeelaa).. ఇది ఒక హార్ట్ టచింగ్ మ్యూజికల్ బయోపిక్. పంజాబ్ లోని ఒక ఫేమస్ ఫోక్ సింగర్ లైఫ్ ని ఇందులో చూపించారు. ఇంతియాజ్ అలీ డైరెక్ట్ చేసిన ఈ మూవీ సహజత్వానికి దగ్గరగా ఉంటుంది‌. ఏఆర్ రహమాన్ మ్యూజిక్ కట్టిపడేస్తుంది. ఒక ఆర్టిస్ట్ మీద సమాజం ఎఫెక్ట్ ఎలా ఉంటుంది. ఆర్టిస్ట్ కి తన భావజాలాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా లేనప్పుడు‌‌ అతని లైఫ్ ఎలా ఉంటుందనేది ఇందులో చూపించారు. ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఉంది.

ఐ వాంట్ టు టాక్( I want to Talk).. సుజిత్ సర్కార్ ఈ సినిమాకి దర్శకుడు కాగా … సైలెన్స్  అండ్ పర్ఫామెన్స్ లతో ఒక థాట్ ఫుల్ ఎక్స్ పీరియన్స్ ని దర్శకుడు చెప్తాడు. చావుకి దగ్గరగా ఉన్న ఓ పర్సన్ లైఫ్ లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కరితో అతని కనెక్షన్ అండ్ ఎమోషన్స్ ఎలా మారతాయో చక్కగా చూపించారు. అయితే ఇది స్లో పేజ్డ్ మూవీ కాబట్టి కాస్త ఓపికతో చూడాలి కానీ చివరి వరకు చూస్తే ఓ ఢిఫరెంట్ థ్రిల్ ని ఇస్తుంది. ఇది అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here