ఆప్ఘనిస్థాన్ దేశాన్ని హస్తగతం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులు మహిళల పట్ల అత్యంత క్రూరకంగా ప్రవర్తిస్తూ ఆటవిక రాజ్య పాలన సాగిస్తున్నారు. తాజాగా మరో కిరాతక ఆదేశాలు జారీ చేశారు. మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే అవకాశం ఉందని, అందువల్ల మహిళలు కనిపించకుండా కొత నిర్మాణాల్లో కిటికీలు పెట్టుకోవాలని ఆదేశించారు. తాలిబన్ నేత తన ఎక్స్ వేదికగా పోస్ట్ చేసిన ఈ ఆదేశాలు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికర చర్చ సాగుతుంది.
తాజాగా జారీచేసిన ఆదేశాలు మరోమారు తాలిబన్ల గురించి చర్చించుకునేలా చేశాయి. నూతనంగా నిర్మించే ఇళ్లల్లో మహిళలు బయటకు కనిపించేలా కిటికీలు ఏర్పాటు చేయవద్దని ఆదేశించారు. ఇప్పటికే నిర్మించి ఉంటే వాటిని మూసివేయాలని పేర్కొన్నారు. వంట గదులు, ఇంటి ఆవరణ, నీటి కోసం బావుల వద్దకు వచ్చే మహిళలు బయటి వారికి కనిపిస్తే అభ్యంతరకర చర్యలకు దారితీసే అవకాశం ఉందని, కాబట్టి వారు కనిపించకుండా గోడలు కట్టాలని తాలిబన్ ప్రభుత్వ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మహిళలు బయటి వారికి కనిపించేలా ఇప్పటికే ఇళ్లలో ఉన్న నిర్మాణాలను మూసివేయాలని కోరారు. తాజా ఆదేశాల నేపథ్యంలో మున్సిపల్ అధికారులు కొత్త నిర్మాణాలను పరిశీలిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here